Unaware of contents of files related to Netaji says grandson

Unaware of contents of files related to netaji says grandson

westbengal, centre, filed, germany, netaji subhash chandra bose

Unaware of contents of files related to Netaji Subhash Chandra Bose, says grandson Netaji Subhash Chandra Bose's grandson Surya said he was unaware of the content of the files and need to wait till Monday. "If there are documents which would expose the misdeeds of our so called great leaders in connection with Netaji's disappearance then of course it will put pressure on the Central government to declassify their files," said Surya Bose.

నేతాజీ విషయంలో అనుమానమే నిజమైంది

Posted: 09/19/2015 08:22 AM IST
Unaware of contents of files related to netaji says grandson

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద విడుదలైన తాజా 64 ఫైళ్ల మీద నేతాజీ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమ  కుటుంబంపై ప్రభుత్వం నిఘా వేసిందని 70 ఏండ్లుగా మేం అనుమానిస్తున్న విషయం నిజమేనని ఈ పత్రాలద్వారా తేలిందని బోస్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నిఘా ఫైళ్లను నేను ఇప్పుడు చూడగలుగుతున్నాము..  చంద్రబోస్ కొడుకు అమియనాథ్ బోస్‌తోపాటు శిశిర్‌బోస్, అరబిందో బోస్‌లపై నాటి ప్రభుత్వాలు నిఘా పెట్టాయని బోస్ ముని మనవడు అన్నారు. బోస్ కుటుంబీకులు, ఆయన అనుచరులపై నిఘా వేయాల్సిన అవసరమేంటి? అని అతను ప్రశ్నించారు. మా తండ్రి అమియనాథ్ బోస్.. దావూద్ ఇబ్రహీం కాదు! అయినా ఇంటెలిజెన్స్ విభాగంనుంచి 14 మందిని ఆయనపైనా, మా కుటుంబంపైనా నిఘాకు నియమించారు. భారత విప్లవకారుడి కుటుంబంపై భారత ప్రభుత్వం ఎందుకు నిఘా వేసింది? దీనిపై ప్రధాని మోదీ విచారణకు ఆదేశించాలి అని చంద్రబోస్ డిమాండ్ చేశారు.

1972లో సిద్ధార్థ శంకర్ రే బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక కీలకమైన ఫైలు కాల్చివేసినట్లు ఈ ఫైళ్లు బయటకు రావడానికి కొద్ది గంటల ముందు బోస్ కుటుంబానికి ఒక సమాచారం పొక్కింది. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన కీలక సమాచారం అందులో ఉందని చంద్రబోస్ తెలిపారు. ఫైళ్లను విడుదల చేయడంపై హర్షం వ్యక్తంచేసిన చంద్రబోస్.. ఇది సరైన అడుగని పేర్కొన్నారు. నేతాజీ ఫైళ్లను సుదీర్ఘకాలం దాచి ఉంచడంద్వారా కొందరు నేతలు దేశం పట్ల విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని చంద్రబోస్ ఆరోపించారు. నేతాజీ ఫైళ్లను విడుదల చేయడం ద్వారా సీఎం సాహసోపేత చర్య తీసుకున్నారని బోస్ మేనకోడలు, టీఎంసీ ఎంపీ కృష్ణబోస్ అన్నారు. కేంద్రం కూడా తన వద్ద ఉన్న ఫైళ్లు ప్రజల ముందుకు తేవాలని ఆమె కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : westbengal  centre  filed  germany  netaji subhash chandra bose  

Other Articles