Man held for sticking nude pictures of first wife all over the town

Man sticks wife nude pictures across karnataka town

revenge on wife, husband pastes first wife nude posters, bangalore, man, wife, nude pictures, husband revenge on first wife, husband arrested by police, kolar gold field resident arrested, venkatappa pastes wife nude posters, enkatappa second wife absconding, nude poster printer absconding, police on search for printer, revenge, first wife, nude posters, kolar gold fields

police arrested a 65-year-old man for allegedly sticking his first wife’s nude pictures in his town after the latter asked him to end his relationship with his second wife.

తనను కాదన్న భార్య.. నగ్నపోస్టర్లను అతికించిన భర్త..

Posted: 09/18/2015 09:10 PM IST
Man sticks wife nude pictures across karnataka town

తనతో పాటుగా సంపార సాగరాన్ని ఈదిన ఓ అర్థాంగిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఓ భర్త సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే చర్యకు పాల్పడ్డాడు. ఏదో తెలిసీ తెలియని వయస్సులో.. ఉడుకు రక్తంలో చేసిన తప్పు కాదు. తన వయస్సు ఇక సంసార జీవితాన్ని ముగించి సన్యాసి జీవితంపై వెళ్లాల్సిన తరుణంలో అతినీచమైన చర్యకు తెరలేపాడు. కట్టుకున్న భార్య తనను కాదని వెళ్లిపోయిందనే అక్కసుతో 65 ఏళ్ల వృద్ధుడు ఈ నీచానికి ఒడికట్టాడు. భార్యపై కోపంతో ఆమె నగ్నచిత్రాలను పోస్టర్లుగా ముద్రించి ఊరంతా అతికించాడు. చివరకు కటకటాల పాలయ్యాడు.

కర్ణాటక రాజధాని బెంగళూరుకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... కోలార్ గోల్డ్ ఫీల్డ్(కేజీఎఫ్)కు చెందిన వెంకటప్ప(65)కు ఇద్దరు భార్యలు. రెండో పెళ్లిచేసుకున్న వెంకటప్పతో మొదటి భార్య తరచుగా గొడవపడేది. రెండో భార్యను వదిలేసి రావాలని ఎన్నిసార్లు చెప్పినా అతడు వినలేదు. దీంతో విసిగిపోయిన మొదటి భార్య తన కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. రెండో భార్యను వదిలించుకుంటేనే కాపురానికి వస్తానని అందరిలో కడిగిపారేసింది.

దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన వెంకటప్ప ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. తాము ఏకాంతంగా గడిపిన ఫోటోలతో పోస్టర్లు ముద్రించి ఊరంతా అతికించాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని కటకటాల వెనక్కి నెట్టారు. ఊరంతా అతికించిన పోస్టర్లను బాధితురాలి బంధువులు చించేసి మంటల్లో వేశారు. వెంకటప్ప రెండో భార్య, పోస్టర్లు ముద్రించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విషయం తెలిసిన వారంతా వెంకటప్ప.. ఇదేందప్పా అంటూ ముక్కున వేలేసుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revenge  first wife  nude posters  kolar gold fields  karnataka town  

Other Articles