Newborn cry stirs failing mom from coma, family says

The incredible story of how a newborn s cry may have helped save her mother s life

Shelly Cawley, Jeremy Cawley, Rylan Grace Cawley, Rylan Cawley, Concord, North Carolina, Carolinas Medical Center-NorthEast, skin to skin contact, child birth, pulmonary embolism, preeclampsia, HELLP syndrome

Shelly Cawley was in a coma for a week after the emergency delivery of her daughter, but Wakes From Coma After Hearing Her Newborn Daughter Cry

పేగుబంధామా.. ఇదేనా చిరునామా.. కోమాలోకి జారుకున్న తల్లిలో చలనం కల్పించిన శిశువు..

Posted: 09/18/2015 09:01 PM IST
The incredible story of how a newborn s cry may have helped save her mother s life

బంధాలు, అనుబంధాలు, ప్రేమానురాగాలు, సెంటిమెంట్లు ఇవి ఫుష్కలంగా వున్నవి మనుషుల మధ్య, అయితే పాశ్చ్యాత ధోరణితో కొన్ని దేశాల్లో ఇవి మచ్చకు కూడా కనిపించకపోయినా.. వాటి మహత్తు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇలాంటి పెంటిమెంట్లకు పుట్టనిల్లు భారత్. అచ్చంగా పాత సినిమాల్లో చూపించినట్లుగా భారత్ లో ముఖ్యంగా దక్షిణాధిలో ఈ సెంటిమెంట్లను ఆదరణ ఎక్కువ. అందుకనే ఇంకా ఇక్కడ సెంటిమెంటు గల చిత్రాలకు ప్రాధ్యానత్య ఇస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ పెంటిమెంట్లను పాటిస్తారా..? పట్టించుకుంటారా.. లేదా..? అన్న విషయాన్ని పక్కనబెడితే.. భారతీయులను ఈ విషయంలో గేలి చేయడం మాత్రం ఇబ్బందికర పరిణామాలు.

దాదాపుగా అంపశయ్యపై వుండి ప్రాణాలు వదిలిన దేహంగా వున్న దశలో కూడా తమ ఇష్టమైన తల్లి, ప్రియురాలు, పిల్లలు ఇలా ఎవరైనా ఆర్తనాధం చేస్తే.. మళ్లీ పుంజుకుని హీరో విలన్ల ఆట కట్టించడం భారతీయ సినిమాల్లోనే సాధ్యం అంటూ ఇన్నాళ్లు విదేశీయులు చేసిన విమర్శలకు ఈ ఘటనే నిజమైన ఉదాహరణ. అమెరికాలోని ఉత్తర కరోలినా ఆసుపత్రిలో జరిగిన ఈ సంఘటనలో ఓ రోజుల శిశువు తన తల్లి షెల్లీ క్వాలే ప్రాణాలను కాపాడింది. బిడ్డను ప్రసవించి కోమాలోకి వెళ్లిపోయిన ఆ కన్నతల్లి షెల్లీ క్వాలే ని కాపాడింది శిశువు ఏడుపే. షెల్లీ క్వాలే లో చలనం తీసుకువచ్చింది స్వయంగా తన పేగుబంధమే. నమ్మశక్యంగా లేదా..? కానీ ఇది నిజం. ఈ నిజాన్ని తెలిపింది ఎవరో తెలుసా.. స్వయంగా తన గారాల పట్టి తల్లి షెల్లీ క్వాలే .

ఎమర్జెన్సీగా తన బిడ్డకు జన్మనిచ్చిన షెల్లీ క్వాలే.. నార్త్ కరోలినా అసుపత్రిలో కోమాలోకి జారుకుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. వైద్యులు శతవిధాల ప్రయత్నించి ఆమె ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలున్నీ బుడిదలో పోసిన పన్నీరులా తయారైంది. షెల్లీ క్వాలే బీపీ 60/40కి  పడిపోయింది. హృదయ స్పందన సాధారణ స్థాయి కంటే కూడా విపరీతంగా కొట్టుకుంటోంది. ఇలా వారం రోజులు గడిచినా అమె ఆరోగ్యంలో ఏలాంటి పురోగతి లేదు. చివరికు వైద్యులు కూడా వల్ల కాదని చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది.
    
ఇంతలో షెల్లీ క్వాలే సపర్యలు చేస్తున్న నర్స్కు ఓ ఆలోచన వచ్చింది. అంతే అప్పుడే పుట్టిన శిశువుకు తల్లికి అనుబంధం ఉంటుందని అంటారు కదా అలా. కోమాలో తల్లి వద్ద శిశువును ఉంచుదామని వైద్యులుకు తెలిపింది. అంతే అనుకున్నదే తడవుగా దానిని ఆచరణలో పెట్టారు. ఆ శిశువును తల్లి వద్ద ఉంచి బుగ్గ మీద వేలుతో తట్టారు. ఆ బిడ్డ ఏడవటం ప్రారంభించింది.... ఆ ఏడుపు విని ఆ తల్లి స్పందించడం ప్రారంభించింది. దాంతో వైద్యులు ఆ శిశువును తల్లి వద్దే ఉంచి వైద్యం చేయడం ప్రారంభించారు. దాంతో తల్లి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటమే కాకుండా... ఆరోగ్యవంతురాలైంది. ఈ మేరకు షెల్లీ క్వాలే తన జీవితంలో చోటు చేసుకున్న ఈ సంఘటనను ఇటీవల మీడియాకు వెల్లడించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shelly cawly  newborns  north carilina hospital  coma  daughter  sentiment  

Other Articles