New files on Netaji were released

New files on netaji were released

netaji subhas chandra bose, subhash chandra bose, WB govt

Hidden in government and police lockers for years, 64 classified files with over 12,000 pages will be on display at the Kolkata police museum. When the files are thrown open to the public from Monday, many more secrets are expected to emerge on Netaji, whose death has been an enduring mystery for decades.

నేతాజీ మిస్టరీపై ఆ 64 ఫైళ్లు

Posted: 09/18/2015 01:40 PM IST
New files on netaji were released

నేతాజీ సుభాస్ చంద్రబోస్ కు అనుమానస్పద మృతి మిస్టరీ వీడనుంది. 1945 ఆగష్టు 18 న విమాన ప్రమాదంలో ఆయన మరణించారా? లేదా ఆ ప్రమాదంలో ఆయన తప్పించుకున్నారా అన్న విషయం తేలనుంది. ఆయనకు సంబంధించిన 64 రహస్య ఫైల్స్ ను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బాహ్య ప్రపంచానికి బహిర్గతం చేసింది. మొత్తం ఫైల్స్ ను డిజిటలైజేషన్ చేసిన ప్రభుత్వం వాటికి సంబంధించిన సి‌డి లను అందరి సమక్షం లో నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేసింది. సోమవారం నుంచి కోల్ కతా పోలీసు మ్యూజియం లో వాటిని సామాన్యుల సందర్శనార్ధం అందుబాటులో ఉంచనున్నారు. ఈ మొత్తం 64 ఫైల్స్ లో 12744 పేజీలు కలిగిఉన్నాయి. కాగా నేతాజీ 1964 వరకు ఆగ్నేయాసియా ప్రాంతంలో బ్రతికే ఉన్నాడని అమెరికన్ బ్రిటిష్ నిఘా వర్గాల సమాచారం.

వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయాన్ని బోస్ వారసులు స్వాగతిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తన వద్ద ఉన్న 134 ఫైల్లను బహిర్గతం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని భారత్ కు వెల్లడించాలని జపాన్, రష్యా, బ్రిటన్ దేశాలను బోస్ కుటుంబ సభ్యులు కోరారు. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం బోస్ మరణం మీద ఫైల్లను వెల్లడించడానికి వీలులేదని.. ఎందుకంటే దేశ విదేశీ వ్యవహారాల మీద ప్రభావం చూపుతుందని వెల్లడించింది. అయితే బోస్ కుటుంబ సభ్యులు ప్రధాని మోదీని కలిసి నిజాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : netaji subhas chandra bose  subhash chandra bose  WB govt  

Other Articles