Tax on Tobacco products in Telangana

Telangana govt proposed to get more income by tax on cigarettes

cigarette, Tobacco, Telangana, Tax, Tobacco products

Telangana Govt proposed to get more income by tax on cigarettes. May increase the tax percent on cigarettes in Telangana soon.

తెలంగాణలో సిగరెట్ తాగేవారికి చేదు వార్త..!?

Posted: 09/16/2015 08:41 AM IST
Telangana govt proposed to get more income by tax on cigarettes

పొమ్మన లేక పొగ పెడుతున్నారని నానుడి ఉంది. పొగ పెడితే ఎవరైనా తట్టుకోలేక పారిపోతారు.. అయితే పొగరాయుళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో పొగబెడుతోంది. పాపం తెలంగాణ సర్కార్ నిర్ణయం అమలులోకి వస్తే మాత్రం పొగరాయుళ్లు పొగకు దూరం కావాల్సిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తుల మీద పన్నును ముందుకన్నా పెంచింది. ఎందుకు అలాఅంటే మాత్రం పొగాకు వాడకాన్ని ఎలాగూ నిలిపివెయ్యలేం. కానీ మన వాళ్లు అతిగా వాడకం వల్ల నష్టం వస్తోంది కాబట్టి వారిని పొగ తగ్గించమని చెప్పే కన్నా పొగాకు ఉత్పత్తుల మీద పన్ను వేస్తే సరిపోతుందని కేంద్రం వివరణ. అయితే తాజగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నేనేం తక్కువ తిన్నానా అంటూ పొగాకు ఉత్పత్తుల మీద పన్ను వేటుకు సిద్దమవుతోంది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదిత భారీ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులకు కొరత లేకుండా పన్నులపై ప్రభుత్వం దృష్టి నిలుపుతోంది. సమగ్ర పన్నుల వసూలుతోపాటు కొత్తగా కొన్ని వస్తువు లపై పన్నురేటును పెంచేదిశగా ప్రభుత్వం పావులు కదుపు తోంది. చిరు వ్యాపారినుంచి మొదలు బడా పారిశ్రామిక వేత్తల వరకు బకాయిలు లేని పన్ను వసూలుతో ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుకోవాలని ప్రభుత్వం కసరత్తును చేస్తోంది. ఇప్పటికే ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రి తలసాని అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్రో, మద్యం ఉత్పత్తులపై మరో 2 శాతం పన్నురేటును పెంచేందుకు కసరత్తు వేగం చేశారు. అదేవిధంగా సిగరెట్లపై 20 శాతంగా ఉన్న పన్నును మరింత పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే సిగరెట్ ల ధర పెరిగి సగటు సిగరెట్ రాయుళ్లకు నష్టం వాటిల్లుతోంది. మరి తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదన పూర్తి స్థాయి అమలులోకి వస్తే మాత్రం పొగ త్రాగడం కాదు కానీ చూసి ఆనందించాల్సి వస్తుందేమో. పొగబెట్టడం అనే పదానికి పర్ ఫెక్ట్ సీన్ అంటే ఇదేనేమో.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cigarette  Tobacco  Telangana  Tax  Tobacco products  

Other Articles