AP Cm Chandrababu Naidu Praised Srimanthudu Movie And Mahesh babu On His Twitter Account | Tollywood News

Ap cm chandrababu naidu praise srimanthudu movie mahesh babu twitter

chandrababu naidu, mahesh babu, srimanthudu movie, twitter controversy, chandrababu mahesh babu, srimanthudu movie collections

AP Cm Chandrababu Naidu Praise Srimanthudu Movie Mahesh babu Twitter : AP Cm Chandrababu Naidu Praised Srimanthudu Movie And Mahesh babu On His Twitter Account.

భుజాలు తడుముకున్న మహేష్-బాబు!

Posted: 09/14/2015 04:21 PM IST
Ap cm chandrababu naidu praise srimanthudu movie mahesh babu twitter

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఘన విజయం సాధించడంతోపాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. గ్రామాన్ని దత్తత తీసుకుని, దాన్ని అభివృద్ధి బాటలో ఎలా నడిపించాలన్న అంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఈ సినిమా అనంతరం కొందరు సినీ ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు కూడా గ్రామాలను దత్తత తీసుకోవడం మొదలుపెట్టేశారు. ఇలా ఎందరినో చైతన్యవంతుల్ని చేసిన ఈ చిత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఎంతో ఆకర్షించింది.

తాజాగా ‘శ్రీమంతుడు’ సినిమా చూసిన చంద్రబాబు.. ఆ చిత్రంలో ప్రధానాంశమైన ‘సమాజానికి ఇవ్వాలి’ అనే సందేశం ఆకట్టుకుందని తెలిపారు. ఆంధ్రప్రభుత్వం చేపట్టిన ‘స్మార్ట్ విలేజ్ - స్మార్ట్ వార్డ్’ అనే కార్యక్రమానికి ఈ సినిమా చాలా దగ్గరగా వుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం చాలా బాగుందని ఆయన ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మహేష్ బాబు.. తన సినిమాను చూసినందుకు ధన్యవాదాలు చెప్పాడు. చంద్రబాబు ‘శ్రీమంతుడు’ సినిమా చూడడం గర్వంగా వుందని, ఆయన ప్రశంసలను తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని మహేష్ తెలిపాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  mahesh babu  srimanthudu movie  twitter  

Other Articles