Ganesh Immersion in Hyderabad

The immersion of ganesh in hyderabad on september 28

Hyderabad, ganesh, khairatabad Ganesh, Khairatabad Vinayaka, Khiratabad Ganesh Laddu, the immersion of Ganesh

the immersion of Ganesh in Hyderabad On September 28. Hindu Mahasabha declare the date of the immersion of Ganesh in Hyderabad.

వినాయక నిమజ్జనం సెప్టెంబర్ 28న

Posted: 09/14/2015 08:55 AM IST
The immersion of ganesh in hyderabad on september 28

హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తామని.. భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. ఈ నెల 17న జరిగే వినాయక విగ్రహ ప్రతిష్టతో ప్రారంభమయ్యే ఉత్సవాలు... సెప్టెంబర్ 28న జరిగే నిమజ్జనంతో ముగుస్తాయని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఉత్సవాలకు రంజాన్, బోనాల మాదిరిగానే ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గణేష్ విగ్రహాల నిమజ్జనంతో చెరువులు కలుషితం అవుతున్నాయనే విషప్రచారాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీ పిలుపిచ్చింది. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిందూ చైతన్య సభ ఘనంగా నిర్వహించారు.

గణేష్ ఉత్సవాలు జరుపుకునేందుకు సర్కార్ పెడుతున్న కిరికిరిని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తప్పుపట్టింది. వినాయక మండపాల ఏర్పాట్లపై పోలీసుల అభ్యంతరాలు ఏమిటని సమితి నాయకులు ప్రశ్నిస్తున్నారు. భారత రాజ్యాంగం కల్పించిన మతపరమైన స్వేచ్చను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, ఇతర మతాల వేడుకలకు అడగకుండానే సహాయం చేస్తున్న సీఎం కేసీఆర్.. గణేష్ ఉత్సవాలపై వివక్ష ఎందుకు చూపిస్తున్నారని మండిపడ్డారు.  పాశ్చాత్య సంస్కృతికి దూరంగా పండుగను జరుపుకోవాలని, హిందూ మత ఆవశ్యకతను చిన్నజీయర్ స్వామి వివరించారు. సౌదీ ప్రభుత్వం హిందూమతాన్ని గౌరవించి ఆలయాలకు స్థలాలను కేటాయించిందని స్వామి కమళానంద భారతి గుర్తు చేశారు. హిందు మతం గొప్పతనం ప్రపంచానికి తెలిసివచ్చిందని, కానీ కొన్ని మతాల వారు హిందుత్వాన్ని కించపరుస్తున్నారని కమళానంద భారతి ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించేవారు కేవలం హిందువులు మాత్రమేనని మాతా హేమలత శాస్త్రి అన్నారు. హిందూమతంలో ఆ గొప్పతనం ఉందని చెప్పారు. ఇతర మతాలవారికి సహాయం చేయడాన్ని తప్పు పట్టటం లేదని, హిందుత్వం పట్ల వివక్ష చూపితే సహించేది లేదన్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. హుసేన్ సాగర్ ను ఖాళీ చేయటం ఎవరి వల్ల కాదన్నారు. వినాయక సాగర్ లోనే నిమజ్జనాలు ఉంటాయని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles