Bengal govt to declassify 64 Netaji files

Bengal govt to declassify 64 netaji files

Bengal Govt, Netaji, Netaji Subhash Chandra Bose, Modi, Mamatha Bajeree

The West Bengal government is all set to declassify 64 files on Netaji Subhash Chandra Bose, which lying with the state's Home Department, next Friday. "A total 64 files are there with us. There may be one or two more files also. After properly reviewing all the files, we have decided to put them in the public domain from next Friday," West Bengal Chief Minister Mamata Banerjee said

నేతాజీ మిస్సింగ్ మిస్టరీ వీడనుందా...?

Posted: 09/12/2015 03:20 PM IST
Bengal govt to declassify 64 netaji files

సుభాష్ చంద్రబోస్ సీక్రెట్ మిస్టరీ వీడనుందా... బోస్ చనిపోయారా..లేక అదృశ్యమయ్యారా..ఎందుకు ఇన్నాళ్లుగా ఈ అనుమానం వేధిస్తూనే ఉంది..ఈ అనుమానాలకు చెక్ పెట్టేందుకు బెంగాల్ సర్కార్ ముందుకొచ్చింది. నేతాజీకి సంబంధించిన 64 ఫైల్స్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. ఈ తరుణంలో కేంద్రం కూడా తన వద్ద ఉన్నకీలక పత్రాలు బయటపెటితే నేతాజీ అదృశ్యంపై త్వరలో మిస్టరీ వీడిపోయే ఛాన్స్ కనిపిస్తోంది. భారతదేశ చరిత్రలో నేతాజీ మరణం అంతుచిక్కని రహస్యం. ఈ అంశంపై దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. 1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయారని అంతా భావించారు. అప్పటి ప్రభుత్వాలు కూడా బోస్ మృతిని ధృవీకరించాయి. ఐతే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం దీన్ని విశ్వసించడం లేదు. ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించి బ్రిటిష్‌ వారితో సాయుధ పోరాటం చేసిన నేతగా బోస్‌ చరిత్రలో నిలిచిపోయారు. ఐతే బోస్ మరణం మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. తాజాగా సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి తమ వద్ద ఉన్న 64 దస్ర్తాల సమాచారాన్ని బహిర్గత పరచనున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టంచేశారు. ప్రజల కోరిక మేరకు వచ్చే శుక్రవారం నేతాజీ జీవిత వివరాలను  ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామనీ, డాక్యుమెంట్లను కోల్‌కతా పోలీస్ మ్యూజియంలో భద్రపరుస్తామని దీదీ చెప్పారు.

మమతా బెనర్జీ నిర్ణయాన్ని నేతాజీ బంధువులు స్వాగతించారు. దీదీ నిర్ణయంతో బోస్ మరణంపై ఉన్న ఊహాగానాలకు తెరపడటంతో పాటు ఆయన జీవితం గురించి బయటి ప్రపంచానికి తెలిసే అవకాశం కలిగిందన్నారు. నిజాన్ని ఎవరూ తొక్కిపెట్టలేరనీ, గత పాలకుల సంకుచిత బుద్ధితో బోస్ చరిత్రను మరుగున పరిచారని ఆరోపించారు. నేతాజీ దస్ర్తాల వెల్లడితో విదేశీ సంబంధాలు ప్రభావితం అవుతాయని కేంద్రం ఇన్నాళ్లూ పేర్కొంటూ వస్తోంది. నేతాజీకి సంబంధించి బెంగాల్ ప్రభుత్వం వద్ద 64 దస్ర్తాలు, కేంద్ర ప్రభుత్వం వద్ద 100 దస్ర్తాలు ఉన్నట్లు సమాచారం. సుభాష్ చంద్రబోస్ మరణంపై రహస్యాలను బహిర్గత పరచాలంటూ ఆయన కుటుంబ సభ్యులతో పాటు నేతాజీ మరణంపై పరిశోధన చేస్తున్న పలువురు పరిశోధకులు ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు.  కేంద్రం కూడా నేతాజీకి సంబంధించిన అన్ని దస్త్రాలను బయట పెట్టాలని నేతాజీ బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bengal Govt  Netaji  Netaji Subhash Chandra Bose  Modi  Mamatha Bajeree  

Other Articles