Beef an in Jammu Kashmir

Jammu kashmir highcourt bans beef across the state

Jammu Kashmir, JK, High court, Beef, ban, JK High court

The Jammu and Kashmir High Court on Wednesday banned the sale of beef across the state. It has also asked state government to take steps to ensure that the ban is strictly implemented.

జమ్ము కాశ్మీర్ లో గోమాంసం బ్యాన్

Posted: 09/10/2015 04:44 PM IST
Jammu kashmir highcourt bans beef across the state

జమ్మూకాశ్మీర్ హైకోర్టు గోమాంసం అమ్మకాలపై నిషేధం విధించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోనూ నిషేధం కచ్చితంగా అమలు జరిగేలా చూడాలని ఆదేశించింది. ముంబైలో గో మాంసంపై నిషేధం అమలుతో తలెత్తిన వివాదం పరిష్కారం కాకముందే జమ్మూ కాశ్మీర్ లో గో మాంసం అమ్మకాలపై హైకోర్టు నిషేధం విధించడం చర్చనీయాంశమైంది. గోమాంసం, అమ్మకం, వినియోగంపై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్ పై జమ్మూకాశ్మీర్ హైకోర్టు డివిజినల్ బెంచ్ ఈ ఆదేశాలు జారీచేసింది. జైన్ ల పవిత్ర కార్యక్రమం పర్యుషాన్ సందర్భంగా ముంబైలో గోమాంసం నిషేధిస్తూ బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ హైకోర్టు రూలింగ్ చర్చనీయాంశమైంది.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో  గోమాసం వినియోగించేవారి సంఖ్య చాలా ఎక్కువ. అందువల్ల ఒక్కసారిగా  ఈ మాంసం విక్రయాలను నిషేధించడం, పూర్తిగా నివారించడం ప్రభుత్వానికి ఇబ్బంది కరమైన విషయమే. గోమాంసం అమ్మకాలపై హైకోర్టు నిషేధం విధించినా.. అక్కడక్కడ కొన్ని  మాంసం దుకాణాలు తెలిచే ఉండగా.. అమ్మకాలు కూడా జరిగాయి. మాంసం అమ్మకాలు యథేచ్ఛగా సాగాయి. అయితే ఇప్పటివరకూ జమ్మూ కాశ్మీర్ లోని పీడీపీ – బీజేపీ సర్కార్ హైకోర్టు తీర్పుపై ఏవిధంగా కూడా స్పందించకపోవడం విశేషం. హర్యానా, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకూ బీఫ్ మాంసం అమ్మకాలను నిషేధించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu Kashmir  JK  High court  Beef  ban  JK High court  

Other Articles