పాకిస్థాన్ గత కొంత కాలంగా కయ్యానికి కాలుదువ్వుతోంది. ఎంతో కాలంగా నడుస్తున్న సరిహద్దు వివాదానికి మరింత ఆజ్యం పోసేలా పాకిస్థాన్ కు చెందిన ఆర్మీ అధికారులు మంటలు రేపుతున్నారు. బారత్ మీదకు యుద్దానికి దిగితే అవసరమైతే అణ్వాయుధాలను కూడా వాడాలని.. అందుకు వేగంగా అణ్వాయుధాలను తయారు చేస్తోందని అమెరికా నిఘా వర్గాలు గతంలోనే హెచ్చరించాయి. ప్రస్తుతం పాకిస్థాన్ భారత్ తో యుద్దాన్ని కోరుకుంటోంది. భారత్ తో ఎలాగైనా యుద్దానికి దిగాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సరిహద్దుల వద్ద పదేపదే దాడులకు దిగుతూ భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే గత కొంత కాలంగా జరగుతున్న పరిణామాల మీద పాకిస్థాన్ మీడియాలో చర్చసాగుతోంది. అక్కడి మీడియాలో ఒకటే చర్చ అది కూడా మోదీ గురించే. మోదీ ప్రధానిగా ఉన్నంత కాలంగా యుద్దం అవసరమా అన్నదే అక్కడ ప్రధాన చర్చ.
భారత్‌లో ఉన్నది మన్మోహన్ ప్రభుత్వం కాదు మోదీ సర్కారంటూ పాక్ మీడియాలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ముంబైపై ఉగ్రవాద దాడి లాంటి ఘటన పునరావృతమైతే పాకిస్థాన్ గతి ఏమై పోతుందనే ప్రశ్న టీవీ ఛానెళ్ల చర్చల్లో పాల్గొనే విశ్లేషకులను ఉలికిపడేలా చేస్తోంది. దీనిపై సమాధానాలు చెప్పలేక వారు సతమతమైపోతున్నారు. మోదీ బూచీతో పాకిస్థాన్‌లో జ్వరం వచ్చిన వాతావరణముందని టీవీ చర్చల ద్వారా తెలుస్తోంది. మన్మోహన్ హయాంలో 2008 నవంబర్ 26న ముంబైపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 164 మందిని పొట్టనపెట్టుకున్నారు. నాలుగు రోజుల పాటు ఉగ్రవాదులు సాగించిన మారణ హోమంలో 308 మంది గాయపడ్డారు. ఇలాంటి దాడి కనుక ఇప్పుడు మరొకటి జరిగితే మోదీ ప్రభుత్వం మన్మోహన్ ప్రభుత్వం తరహాలో చూస్తూ ఊరుకోబోదంటూ పాక్ టీవీ ఛానెళ్లలో చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. చర్చల్లో జర్నలిస్టులు మోదీ ప్రభుత్వ బూచిపై విశ్లేషకులను ప్రశ్నిస్తుండటం పాక్ భయాన్ని వెల్లడిస్తోంది. ముంబై లాంటి ఘటన మరొకటి జరిగితే పాకిస్థాన్ పూర్తి బెలూచిస్తాన్‌ను కోల్పోవాల్సి వస్తుందన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హెచ్చరికను టీవీల్లో నిత్యం చూపిస్తున్నారు. అజిత్ దోవల్‌కు తోడు ప్రస్తుతమున్నది మోదీ ప్రభుత్వమంటూ జరుగుతున్న చర్చలు పొరుగుదేశం భయాలను బయటపెడుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more