Amrita Rai says 'want digvijay to give his property to his children'

Amrita rai confirms marrying digvijay singh

Congress General secretary Digvijay Singh, digvijay singh marries Amrita Rai, rajyasabha anchor amrita rai, Digvijay Singh amrita relationship, Digvijay Singh wife amrita rai, digvijay tied knot with TV journalist Amrita Rai, Amrita Rai,Digvijay Singh,marriage,Rajya Sabha TV,Rajya Sabha TV anchor,TV anchor, amrita facebook

Amrita on Sunday took to social networking site Facebook and confirmed the news that I and Digvijaya Singh have married in a solemn ceremony, as per the Hindu rites.

ఏడాదిన్నర కాలంగా సోషల్ మీడియా బాధితురాలినయ్యాను

Posted: 09/06/2015 02:32 PM IST
Amrita rai confirms marrying digvijay singh

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తో తన వివాహంపై వస్తున్న వార్తలను రాజ్యసభ టీవి యాంకర్, జర్నలిస్ట్ అమ్రితా రాయ్ దృవీకరించారు. తామిద్దరం వివాహం చేసుకున్నామని అమె వెల్లడించారు. తమ పెళ్లిని ప్రభుత్వ రికార్డల ప్రకారం రిజిస్టర్ కూడా చేసుకున్నామన్నారు. అయితే గత ఏడాదిన్నర కాలంగా తాను సోషల్ మిడియా బాధితురాలిగా మారానని, తనపై అసభ్యకర రీతిలో దూషణలు, అమార్యాదకర ప్రచారాలు చేశారని అమె అన్నారు. అయితే ఆ కష్టకాలంలో తన పక్షాన నిలిచి దైర్యానిచ్చిన తన స్నేహితులు, శ్రేయోభిలాషులకు అమె ధన్యవాదాలు తెలిపారు. అమె సోషల్ మీడియా పేస్ బుక్ ద్వారా వెల్లడించిన పూర్తి లేఖ సారంశం మీకోసం..

నేను నా స్నేహితులతో ఒక సంతోషకరమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను మరియు దిగ్విజయ్ సింగ్ హిందూ ఆచార, సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాం. వివాహం తరువాత మా పెళ్లిని రిజిస్టర్ కూడా చేసుకున్నాం. గత ఏడాదిన్నర కాలంగా నేను ఎదుర్కోంటున్న విపత్కర పరిణామాల సమయంలో నా పక్షాన నిలచి ధైర్యాన్నిచ్చిన అందరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత సంవత్సరమున్నర కాలం నేను తీవ్ర ఒత్తడితో పాటు అనేక బాధను అనుభవించాను.

నేను సామాజిక మాధ్యమాల బాధితురాలిగా మారాను. సోషల్ మీడియా నన్ను ఓ దోషిలా, నేరస్థురాలిగా చూసింది. ఏ తప్పు చేయని నన్ను ఎందరో అత్యంత అసభ్యకర బాషలో దూషించారు. నా ప్రతిష్టను కూడా పూర్తిగా దిగజార్చేలా దూషణలు చేశారు. ఎవరికైతే వారిపై కానీ, వారి ప్రేమపై నమ్మకం, విశ్వాసం, గౌరవం లేని వారే నన్ను సామాజిక మాధ్యమం ద్వారా అవమానపర్చేందుకు యత్నించారు. అయితే ఈ ఏడాదిన్నర కాలంగా తాను హుందాను ప్రదర్శిస్తూ మౌనాన్ని వహించి నా పని నేను చేసుకువెళ్లాను. ఇందుకు కారణం తనపై తనకు వున్న నమ్మకం, అదే స్థాయిలో దిగ్విజయ్ సింగ్ పట్ల వున్న తన ప్రేమపై నమ్మకమే.

ఈ సమయంలో మా ఇద్దరి వయస్సు మధ్య తేడాపై ప్రశ్నలు తలెత్తాయని, తలెత్తుతాయని నాకు తెలుసు. అయితే ఈ వయస్సులో నాకు ఏది మంచి అన్న విషయాలు తెలుసునని నిజాయితీగా చెబుతున్నాను. నా సంపూర్ణ జ్ఞానంమేరకు నా నిర్ణయాలను నేను స్వతంత్రంగా తీసుకోవచ్చని నమ్ముతున్నాను. మేము ఒక అధునిక, అభ్యుదయ భారతదేశంలో వున్నామన్న విషయాన్ని మర్చిపోలేదు. దేశం మాకు కల్పించిన రాజ్యంగం మేరకు, చట్టబద్దత లోబడి నా జీవితం  గురించి,  జీవితంలో ఎంపికల గురించి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అధికారముంది.

నా ఉద్దేశ్యాలు కూడా నేను తీసుకునే నిర్ణయాలపై అధారపడి వుంటాయన్ని తెలుసు, అయితే ఇలాంటి అనేక వ్యవహారాల్లో సమయం మాత్రమే చివరి మధ్యవర్తిగా నిలబడుతుందని కూడా తెలుసు. నేను ఒక ప్రోఫెషనల్ మహిళను, నేను నా కెరీర్ మొత్తంలో కష్టపడి పనిచేస్తూనే వున్నారు. నేను ఈ సమాజంలో నాకంటే ఓక స్థానాన్ని, ఖ్యాతిని, కీర్తిని, గుర్తింపును సాధించుకున్నాను. ఇరతు ఆధునిక మహిళల మాదిరిగానే నేను నా ఫ్రోఫెషనల్ సామర్థాలను నమ్ముతాను. నా వ్యక్తిగత బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలను కూడా సమర్థవంతగా సమాన నిష్పత్తిలో కొనసాగించాను, ఇకపై కూడా కొనసాగిస్తాను.

దిగ్విజయ్ సింగ్ నుంచి తాను ఆశించింది కేవలం ప్రేమను మాత్రమే. అందుకే తన ఆస్తిపాస్తులన్నింటినీ ఆయన తన కూతుళ్లకు, కుమారుడికి వారసత్వంగా ఇవ్వాలని ఇప్పటికే అభ్యర్థించాను. దిగ్విజయ్ తో కలసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలని మాత్రమే వుంది, దాంతో పాటు తన గౌరవ ప్రదమైన, ప్రోఫెషనల్ కెరీర్ లోనూ ముందుకు సాగాలని వుంది. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచి, మద్దతునిచ్చి, ధైర్యానిచ్చిన తన స్నేహితులకు, కార్యాలయ సహచరులకు మరియు శ్రేయోభిలాషులకు మరోసారి ధన్యవాదాలు.... ఇట్లు అమ్రిత.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amrita Rai  Digvijay Singh  congress  marriage  amrita facebook  

Other Articles