Psycho | Injection | Hyderabad

Injection psycho is in the hyderabad

Psycho, Injection, Hyderabad, Godavari, Injection Psycho

Injection Psycho is in the Hyderabad. Some unknown person in hyderabad attacked on a school kid in the morning.

హైదరాబాద్ లో సిరంజి సైకో..?

Posted: 09/05/2015 01:15 PM IST
Injection psycho is in the hyderabad

పశ్చిమ గోదావరిలో గత కొంత కాలంగా జరుగుతున్న సిరంజి దాడుల గురించి అందరికి తెలుసు. ఆ సైకో కోసం ఏపి పోలీసులు జల్లెడ పడుతున్నా.. ఇప్పటి వరకు కనీసం జాడ పట్టకోలకపోయారు. అయితే సైకో నమూనా ఫోటోలను పోలీసులు విడుదల చేసినా కానీ ఫలితం లేకుండా పోయింది. ముందు ఆడవాళ్లను టార్గెట్ గా చేసిన సైకో.. తర్వాత మగవాళ్లను కూడా టార్గెట్ గా చేసుకున్నాడు. ఎక్కడి నుండి వస్తాడో తెలియదు.. ఎలా వస్తాడో తెలియదు.. కానీ వస్తాడు సూదితో దాడి చేస్తాడు వెళ్తాడు. అంతే సూదిగాడు చేస్తున్న దాడులతో గోదావరి ప్రజలు విస్తుపోతున్నారు.. ఒంటరిగా బయటకు రావాలంటే భయపడి చస్తున్నారు. అయితే ఏపిలో పైకో తరహా దాడులు తాజాగా హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో జరిగాయి. దాంతో హైదరాబాద్ లోనూ కలకలం రేగుతోంది. కొంపదీసి సైకో సూదిగాడు అక్కడి నుండి హైదరాబాద్ కు వచ్చాడా..? లేదంటే మరో సైకో తెర మీదకు వచ్చాడా.? అని పోలీసులు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో గౌతమ్ నగర్ వద్ద నాలుగో తరగతి చదువుతున్న  విద్యార్థిని మీద గుర్తుతెలియని వ్యక్తి సూది తో దాడి చేశాడు. ఎవరు చేశారో తెలియదు కానీ సూదితో దాడి జరిగినట్లు స్పష్టమైంది. వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పశ్చిమ గోదావరికే పరిమితమయ్యాడని అనుకున్న సైకో సూదిగాడు హైదరాబాద్ లోకి ఎంటరయ్యాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్చలు చేపట్టారు. అనుమానం కలిగితే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని పోలీసులు వెల్లడించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Psycho  Injection  Hyderabad  Godavari  Injection Psycho  

Other Articles