AP | Assembly Sessions | Chandrababu naidu | Jagan

From today onwards ap assembly sessions will starts

AP, Assembly, Assembly Sessions, Chandrababu naidu, Jagan

From today onwards ap assembly sessions will starts. Opposition party YSRCp and congress getting ready to speak about the Govt Failures.

ఏపి అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు యుద్దానికి సై

Posted: 08/31/2015 08:39 AM IST
From today onwards ap assembly sessions will starts

ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వ అస్తవ్యస్త పాలనపై ప్రశ్నించాలని ప్రతిపక్ష వైసీపీ, ప్రతిపక్ష నేతలను ఘాటుగా ఎదుర్కోవాలని అధికార టీడీపీ అస్త్ర శస్ర్తాలతో సిద్ధమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి హాట్‌హాట్‌గా జరుగనున్నాయి. ప్రజారంజక పాలన అందిస్తామంటూ 14 నెలల క్రితం అధికారం చేపట్టిన టీడీపీ.. హామీల అమలులో పూర్తిగా విఫలమైందంటూ ప్రతిపక్ష పార్టీ ఇప్పటికే ప్రజల మధ్య నుంచి ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వైసీపీకి కలిసివచ్చినట్లయింది. ప్రజా సమస్యలకు సంబంధించి ప్రభుత్వంపై దూకుడుగా దాడి చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. మరోవైపు ప్రతిపక్షం దూకుడును అంతేస్థాయిలో ఎదుర్కోవాలని టీడీపీ భావిస్తున్నది.

ప్రత్యేక హోదా, రాజధాని భూసేకరణ అంశాలే టార్గెట్గా అసెంబ్లీలో బాబు సర్కార్ను ఇరుకునపెట్టేందుకు వైసీపీ సన్నద్ధమవుతోంది. బాబుకు తెలియకుండా మంత్రి నారాయణ భూసేకరణ నోటిఫికేషన్ ఎలా ఇస్తారని నిలదీయడానికి సిద్ధమవుతోంది. అధికారపక్షం వలపడకుండా ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని వ్యూహం రచిస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షాన్ని ఏ విధంగా నిలదీయాలన్న దానిపై వైసీపి ఎమ్మెల్యేలు ప్లాన్ సిద్ధంచేశారు. జగన్ నేతృత్వంలో లోటస్ పాండ్ నివాసంలో భేటీయైన ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఎపి ప్రత్యేక హోదాపైనే ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పార్టీ నిర్ణయానికి వచ్చింది.

ఢిల్లీలో ధర్నా, శనివారం బంద్ లో లేవనెత్తిన అంశాలతో అధికార పక్షాన్ని కడిగేయాలనుకుంటున్నారు. సమావేశాల తొలిరోజే ప్రత్యేక హోదాపై వాయిదా తీర్మానం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అలాగే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేస్తామంటున్నారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. కేంద్రంపై ఒత్తిడి పెంచకుండా... టీడీపీ ఆడుతున్న నాటకాలను సభ ద్వారా ప్రజల్లో ఎండగడతామంటున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి. ప్రత్యేక హోదాతో పాటు రాజధాని భూసేకరణ, ఓటుకు నోటు కేసు, ఇసుక మాఫియా, రిషితేశ్వరి ఆత్మహత్య కేసు, కరవు, నిత్యావసర వస్తువల ధరల పెరుగుదల అంశాలను వైసీపీ లేవనెత్తే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్ని ఐదు రోజులే కాకుండా కనీసం 15 రోజులైనా జరపాలని బీఏసీ సమావేశంలో అడగాలని నిర్ణయించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Assembly  Assembly Sessions  Chandrababu naidu  Jagan  

Other Articles