Pakistan Exposed Again: After Naveed, another terrorist caught alive

Another pakistani terrorist caught alive

Pakistan Exposed Again: After Naveed, another terrorist caught alive, Another pakistani terrorist caught alive, Usman, Udhampur attack, Mohammed Naveed, Lashkar-e- Taiba (LeT)

A Pakistani terrorist was caught alive on Thursday following a gunfight in Jammu and Kashmir's Baramulla district, police said.

పాక్ ఉగ్రవాది మరోకడు.. సజీవంగా దోరికాడోచ్.. నెలలో రెండోవాడు

Posted: 08/27/2015 06:46 PM IST
Another pakistani terrorist caught alive

దేశంలోకి అక్రమంగ చోచ్చుకువచ్చేందుకు యత్నిస్తున్న పాక్ ఉగ్రవాదుల చొరబాట్లను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇవాళ దేశంలోకి అక్రమంగా చోచ్చుకువచ్చేందుకు యత్నించిన నలుగురిలో ముగ్గురిని హతమర్చిన భారత సైన్యం మరో ఉగ్రవాదని సజీవంగా పట్టుకున్నారు.  ఉత్తర కశ్మీర్లో కొన్ని గంటలపాటు ఎన్కౌంటర్ జరిగిన అనంతరం సజ్జద్ అహ్మద్ అలియాస్ అబు ఉబదుల్లా(22) అనే ఉగ్రవాదిని భారత ఆర్మీ సజీవంగా పట్టుకుంది. ఉగ్రవాది సజ్జద్ అహ్మద్ పాకిస్థాన్లోని బాలోచిస్తాన్కు చెందిన ముజఫర్గఢ్ చెందినవాడిగా అధికారులు గుర్తించారు.

కొద్ది రోజుల క్రితం ఉధంపూర్ లో స్థానికుల సహాయంతో ఉగ్రవాది నవేద్ ను సజీవంగా పట్టుకున్న సైన్యం... కొద్దిరోజులు కూడా తిరక్కుండానే మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకుంది. భారత్ లోకి అక్రమంగా చోరబడేందుకు యత్నించిన మొత్తం నలుగురు ఉగ్రవాదులు దేశ సరిహద్దులు దాటారు. దీంతో భారత సైన్యం పాక్ ఉగ్రవాదులకు మధ్య దాదాపు 20 గంటలపాటు ఎన్కౌంటర్లో చోటుచేసుకుంది. అందులో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన పాక్.. సజీవంగా పట్టుబడిన సజ్జద్ అహ్మద్ ను భారత సైన్యాధికారులు విచారిస్తున్నారు. ఎన్ కౌంటర్ అనంతరం ఉగ్రవాదులకు చెందిన భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Usman  Udhampur attack  Mohammed Naveed  Lashkar-e- Taiba (LeT)  

Other Articles