GSLV-D6 set to fly GSAT-6 to space on Thursday

Countdown begins for isro s gsat 6 launch on thursday

Countdown Begins for Isro's GSAT-6 Launch, GSLV-D6 set to fly GSAT-6 to space, gsat 6, gslv d6, isro, GSAT-6, ISRO, communication satellite, GSLV-D6

Indian space agency is flying the GSLV rocket with its own cryogenic engine for the second time on Thursday after the successful launch of similar rocket in January 2014 that put into orbit GSAT-14.

కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-6 ప్రయోగానికి కొనసాగుతున్న కౌంట్‌డౌన్

Posted: 08/26/2015 08:35 PM IST
Countdown begins for isro s gsat 6 launch on thursday

శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. దేశీయ కమ్యూనికేషన్ వ్యవస్థలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే జీశాట్-6 ఉపగ్రహాన్ని ఇస్త్రో నింగిలోకి పంపనుంది. గురువారం సాయంత్రం 4.52 నిమిషాలకు రాకెట్ ప్రయోగం జరగనుంది. రాకెట్ ప్రయోగం కోసం ఇవాళ ఉదయం 11.52 నిమిషాల నుంచి 29 గంటల పాటు కౌంట్‌డౌన్ ప్రారంభమై కొనసాగుతోంది. జీశాట్-6 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి పంపేందుకు దేశీయ ఉపగ్రహ వాహన నౌక జీఎస్ఎల్వీ డీ-6ను ఇస్త్రో సిద్ధం చేసింది. సతీష్ ధావన్ స్పేట్ సెంటర్‌లోని రెండవ లాంచ్ పాడ్ నుంచి శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం నిర్వహించనున్నారు. దేశీయ కమ్యునికేషన్ వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు జీశాట్-6 ఉపగ్రహం ఉపయోగపడుతుంది.
 
ఈ ఉపగ్రహం బరువు 2,117 కేజీలు. రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా భారీ భద్రత నడుమ జీఎస్ఎల్వీ డీ-6ను రెండవ లాంచ్‌పాడ్‌కు తరలించారు. జీశాట్-6 శాటిలైట్ దేశీయ కమ్యునికేషన్ వ్యవస్థకు సంబంధించింది. మల్టీమీడియా శాటిలైట్ ఫోన్లకు ఈ ఉపగ్రహ టెక్నాలజీ ఉపయోగించనున్నారు. ముఖ్యంగా ఈ ఉపగ్రహంలో పది ట్రాన్స్‌పాండర్లను పంపుతున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు ఉన్న ట్రాన్స్‌పాండర్ల కొరత తీరినట్లవుతుంది. రాకెట్ ప్రయోగం కోసం ఇస్త్రో రూ. 250 కోట్లు ఖర్చు పెడుతుంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే దేశీయ కమ్యూనికేషన్ వ్యవస్థలో జీశాట్-6 25వ ఉపగ్రహంగా నిలువనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gsat 6  gslv d6  isro  

Other Articles