మహానగరాల మందుబాబులకు శుభవార్త. అయితే అన్ని దేశాలకు కాదు కేవలం అగ్రరాజ్యం అమెరికాలోని మహానగరరాల మందుబాబులకే ఇది శుభవార్త. కాలు కదపుకుండా ఆఫీను నుంచి ఇంటికి వెళ్లగానే.. మీ కోరిక తీర్చేందుకు.. అలసటను బాపేందుకు మేమున్నామంటూ ముందుకు వచ్చి మందును అందజేస్తుంది ఓ ఆన్ లైన్ సంస్థ. తన వేగవంతమైన సేవలతో ప్రపంచంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్న ప్రముఖ ఈ కామెర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఆర్డర్ చేసిన గంటలోపే ఇంటి ముందుకు బీరు, వైన్, లిక్కర్లాంటి మత్తుపానియాలు అందించనుంది. ప్రైం నౌ సర్వీస్ పేరిట ఈ సర్వీసులను అమెజాన్ కొత్తగా ప్రారంభించింది. ఇప్పటికే ఈ పద్ధతిని ప్రారంభించిన అమెజాన్ తాజాగా అమెరికాలో ఈ సర్వీసును ప్రారంభించింది. ప్రారంభించిన క్షణాల్లోనే ఈ విధానానికి ఆధరణ పెరిగిందని, ఈ కామర్స్ ద్వారా మద్యం కొనుగోలుచేసేవారి సంఖ్య అమాంతం పెరిగిందని అమెజాన్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. త్వరలోనే ఒక్కొక్కటిగా వివిధ దేశాలకు ఈ సర్వీసులను విస్తరింపజేయాలనుకుంటున్నారు. మరి మన దేశంలోకి అమెజాన్ మద్యం సేవలు ఎప్పటికి వస్తాయో..? అని ఆశగా ఎదురుచూస్తున్నారు మధ్యం బాబులు
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more