YSR Congress MLA Roja Raises Many Questions To Chandrababu Naidu On Ap Special Status | Babu Delhi Tour

Ysr congress mla roja questions chandrababu naidu ap special status

mla roja, roja photos, roja hot photo shoot, roja party press meet, mla roja press meet, roja controversy, roja scandals, roja romance videos, roja cleavage show, roja cleavage photos, roja tattoo, roja press conference, chandrababu naidu, ap special status, chandrababu narendra modi

YSR Congress MLA Roja Questions Chandrababu Naidu Ap Special Status : In The Latest Press Meet YSR Congress MLA Roja Raises Many Questions To Chandrababu Naidu On Ap Special Status And His Delhi Tour.

ఏం బాబు.. వస్తుందా? రాదా?

Posted: 08/24/2015 04:21 PM IST
Ysr congress mla roja questions chandrababu naidu ap special status

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ‘ప్రత్యేక హోదా’ హాట్ టాపిక్ గా మారింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ మాటిచ్చిన బీజేపీ చేతులెత్తేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రజలతోపాటు కాంగ్రెస్, వైకాపా నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైకాపా అయితే.. ప్రజల్లో మమేకమయ్యేందుకు ఇదే సరైన సమయం అని భావించి బీజేపీతోపాటు అధికార టీడీపీ మీద విమర్శల వర్షాన్ని కురిపిస్తోంది. ఇక వైఎస్ఆర్ ఎమ్మెల్యే రోజా ఇదే అంశంపై బాబుని ఎన్నోసార్లు ప్రశ్నించడంతోపాటు విమర్శలు చేసింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఆమె బాబుమీద మండిపడింది.

ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఇటీవలే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే! ఆ ఢిల్లీ పర్యటనపై, స్పేషల్ స్టేటస్ పై ఆమె చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు సంధించింది. ‘ఇంతకీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందా..? లేదా..?’ అని ఆమె నేరుగా ప్రశ్నించింది. అసలు హోదాకు చంద్రబాబు అనుకూలమో లేదా వ్యతిరేకమో కూడా చెప్పాలని ఆమె డిమాండ్ చేసింది. ఒకవేళ కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒప్పుకోకపోతే చంద్రబాబు ఎన్టీయేలోనే కొనసాగుతారా? అని నిలదీసింది. ఆయన ఢిల్లీకి వెళ్లింది ప్రత్యేక హోదా కోసమా? లేక తన పదవిని కాపాడుకోవడం కోసమా?  అని ఆమె అడిగింది. అలాగే.. పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలపై కేంద్రాన్ని బాబు ఎందుకు నిలదీయడం లేదని ఆమె పేర్కొంది.

హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. ఇదే సమయంలో విద్యాసంస్థల్లో విద్యార్థినుల మరణాలపై బాబుని నిలదీసింది. నారాయణ విద్యాసంస్థల్లో మరణాలపై ఎందుకు సమగ్ర విచారణ చేపట్టరని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారంలోకి రాగానే కోట్లు దోచుకొని, ఇతర రాష్ట్రాల్లో పోటీకి టీడీపీ సిద్ధమవుతోందని ఆరోపించింది. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ టీడీపీ నేతలపై ఉద్యమించాలని, లేకపోతే ఆయన్ను ప్రజలు నమ్మరని రోజా హెచ్చరించింది. ఈ విధంగా ఈమె చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో?

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mla roja  chandrababu naidu  ap special status  

Other Articles