CRDA New Plan To Make Two Icon Bridges On Krishna River | Ap Capital City | Amaravathi Development

Crda new plan two icon bridges on krishna river ap capital city amaravathi

Krishna Icon Bridges, CRDA Developments, amaravathi developments, ap capital city, ap capital amaravathi, amaravathi master plan, amaravathi icon bridges, krishna icon bridges plan, icon bridges in amaravathi, chandrababu naidu, CRDA New plans, CRDA developments, andhra pradesh govt

CRDA New Plan Two Icon Bridges On Krishna River Ap Capital City Amaravathi : CRDA Planning To Make Two Icon Bridges On Krishna River.

కృష్ణమ్మ ఒడిలో ఆకాశ ‘వీధులు’..?

Posted: 08/24/2015 10:52 AM IST
Crda new plan two icon bridges on krishna river ap capital city amaravathi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తున్నాయి. ఇప్పటికే రాజధాని మాస్టర్ ప్లాన్ పూర్తవడమే కాకుండా దసరా సందర్భంగా పనులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదిపై అత్యాధునిక టెక్నాలజీతో రెండు ఐకాన్ బ్రిడ్జెస్ (వంతెనలు) నిర్మించేందుకు సీ.ఆర్.డీ.ఏ యోచిస్తోంది. అక్టోబరు 22న రాజధాని పనులు లాంఛనంగా ప్రారంభమయ్యాక వీటి నిర్మాణ పనులపై ప్రభుత్వం పూర్తిగా దృష్టి సారించనుంది. ఇందుకోసం తొలిదశలో రూ.450 కోట్లకుపైగా ఖర్చు చేయనుందని అంచనా. నగర నిర్మాణ పనులన్నీ వేగంగా జరగాలంటే.. కృష్ణానదిపై మొదటి దశలోనే రెండు ఐకాన్ బ్రిడ్జెస్ నిర్మించడం మంచిదని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది.

ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న భవానీ ద్వీపానికి రెండు కిలోమీటర్ల పై ఎత్తున వంతెనల నిర్మాణం అనువుగా ఉంటుందని సీఆర్‌డీఏ, జల వనరుల శాఖల అధికారులు అభిప్రాయపడుతున్నారు. మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా వీటిని నిర్మించాల్సి ఉన్నందున నదికి రెండు వైపులా ఉన్న నేల స్వభావాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నివేదికలు తయారు చేయాలని సర్కారు భావిస్తోంది. కృష్ణా జిల్లాలోని ఉత్తరపు ఒడ్డున ఉన్న నేల స్వభావం వంతెన నిర్మాణానికి అనుకూలంగానే ఉన్నప్పటికీ, గుంటూరు జిల్లాలోని ఒడ్డున ఉన్న నేల మెత్తగా ఉంది. ఈ నేపథ్యంలో గట్టిగా ఉండే అనువైన ప్రదేశం కోసం ఇంజనీరింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఒక్కో వంతెన 3 కిలోమీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పు ఉంటుంది. వంతెనపై రోడ్డుకు ఇరువైపులా పాదచారులు, సైక్లిస్టులు వెళ్లేందుకు వీలుగా ఫుట్, సైకిల్ పాత్‌లను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా సింగపూర్, ఇస్తాంబుల్, టర్కీ ప్రాంతాల్లోని వంతెనలపై ఉన్న మాదిరి గ్రీనరీని అభివృద్ధి చేయనున్నట్లు చెబుతున్నారు.

ఈ వంతెనల నిర్మాణాల్లో మరో విశేషమైన విషయం ఏమిటంటే.. నదిమధ్యలో పియర్స్ లేకుండా నిర్మాణం పూర్తి చేయాలని నిపుణులు యోచిస్తున్నారు. ఇందుకోసం అత్యాధునిక విదేశీ టెక్నాలజీని అధ్యయనం చేస్తున్నారు. నదిలోనావిగేషన్ సక్రమంగా జరగాలంటే పియర్స్ ఉండకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో భద్రత, నిర్మాణ సామర్థ్యం, వ్యయం తదితర అంశాలపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. నదిలోని ఇసుక, పూడిక మట్టిని డ్రెడ్జింగ్ చేయడం ద్వారా నదికి రెండు వైపులా ఉన్న కరకట్టల ఎత్తును రెండు మీటర్ల వరకూ పెంచనున్నారు. అంతేకాకుండా భవానీ ద్వీపం పక్కనే ఉన్న మరో చిన్న ద్వీపాన్ని మీటరు ఎత్తున పెంచి అక్కడ గోల్ఫ్‌కోర్టు, రిసార్టులు నిర్మించాలని సీఆర్‌డీఏ యోచిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : krishna river icon bridges  crda developments  ap capital city amaravathi  

Other Articles