Blood | Prescription | Blood Banks

Banks to issue blood only on mbbs doctors prescription

Blood, Prescription, Blood Banks, Mumbai, patients, MBBS, Doctors

Banks to issue blood only on MBBS doctors prescription Blood banks cannot issue blood and its components on prescriptions written by ayurveda, homeopathy and unani doctors, says a circular issued by the Drugs Controller General of India (DCGI). The August 18 circular will curb the indiscriminate use of blood in treatment that has led to a rise in transfusion-related infections and deaths, it added.

ఇక మీద ఎంబీబీఎస్ రాస్తేనే రక్తం ఇస్తారు

Posted: 08/22/2015 04:35 PM IST
Banks to issue blood only on mbbs doctors prescription

కాసింత వైద్యం తెలిసిన వాళ్లంతా డాక్టర్లైపోరు. కోర్స్ చదవాలి.. ప్రాక్టీస్ చెయ్యాలి. కానీ మన దేశంలో మాత్రం రూల్స్ పట్టవు. బీఏఎంఎస్ లు, భీహెచ్ఎంఎస్ లు కూడా క్లినిక్ లు ఓపెన్ చేసుకొని ఐసియులు పెట్టేసి, ఎమర్జెన్సీ ఆపరేషన్లు కూడా చేసేస్తున్నారు. అయితే ఆ ఆపరేషన్ ల సంగతి ఏమో కానీ ముంబై లాంటి మహా నగరాల్లో రక్తం కొరత బాగా ఉంది. ఏదో ఆపరేషన్ అవసరానికి రక్తం అందుబాటులో ఉండకపోవడంతో చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. అయితే బ్లడ్ బ్యాంకులు విచ్చలవిడిగా రక్తాన్ని అందరికి అందుబాటులో ఉంచాయి. దాంతో చిన్న చిన్న క్లినిక్ లు నడిపే వాళ్లు కూడా రక్తాన్ని స్టాక్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఎవరైనా రక్తం కోసం వస్తే మాత్రం స్టాక్ లేదనో లేదంటే ఎక్కువ డబ్బులకు అమ్ముకుంటున్నారు. అయితే బిఎఎంఎస్, భిహెచ్ఎంఎస్ ల పేరుతో గోల్ మాల్ జరుగుతోందని అదుకే బ్లడ్ కానీ లేదంటే ప్లేట్ లెట్స్ కానీ ఎంబీబీఎస్ రెకమండేషన్ తోనే పంపిణి చెయ్యాలని నిర్ణయించారు.

ఈ మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే పేషంట్ల ఆరోగ్యానికి భద్రత కల్పించేందుకే కొత్తగా ఇలాంటి రూల్ తీసుకువచ్చినట్లు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా జిఎన్ సింగ్ వెల్లడించారు. పేషంట్ల ఆరోగ్యానికి ఎలాంటి ఆపద కగకుండా ఉండేందుకు ఎవరు రక్తాన్ని కోరుతున్నారో తెలిపేలా వివరాలు.. పేషంట్ వివరాలు కూడా ప్రిస్క్రిప్షన్ లో వెల్లడించాల్సి వస్తుందని ఆయన తెలిపారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్త కొరత లేకుండా చెయ్యడంతో పాటుగా విలువైన రక్తాన్ని పేషంట్లకు అందించాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా జిఎన్ సింగ్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Blood  Prescription  Blood Banks  Mumbai  patients  MBBS  Doctors  

Other Articles