TajMahal | Chandelier | crash

Taj mahal chandelier crashes

TajMahal, Chandelier, crash, British era, Tajmahal in Delhi

Taj Mahal chandelier crashes A 60-kg British-era copper chandelier at the main entrance of 17th century Taj Mahal crashed down recently, prompting the Archaeological Survey of India (ASI) to initiate a probe into the matter.

తాజ్ మహల్ లో విలువైన వస్తువు పగిలిపోయింది

Posted: 08/22/2015 03:06 PM IST
Taj mahal chandelier crashes

అందాల తాజ్ మహల్ అందాల గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ప్రేమకు చిహ్నంగా ప్రపంచ వింతల్లో ఒకటిగా తాజ్ మహల్ కు ఉన్న స్థానమే వేరు. అయితే తాజాగా తాజ్ మహల్ లో ఓ విలువైన వస్తువు నాశనమయింది. బ్రిటిష్ కాలంనాటి  విలువైన వస్తువు పలిగిపోవడం మీద వార్తలు వెలువుడుతున్నాయి. అందాల కట్టడం తాజ్ మహల్లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి షాండ్లియర్ ఒకటి పడిపోయింది. దాని బరువు దాదాపు 60 కిలోలు. ఈ ఘటనపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ దర్యాప్తు ప్రారంభించింది. 6 అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పున్న ఈ షాండ్లియర్ను 1905లో లార్డ్ కర్జన్ బహూకరించారు. దాన్ని తాజ్మహల్ రాయల్ గేట్ వద్ద అమర్చారు.అది ఇప్పుడు పడిపోవడంపై ఏఎస్ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు భువన్ విక్రమ్ దర్యాప్తు చేస్తున్నారు. షాండ్లియర్ ఎందుకు పడిపోయిందన్న విషయమై అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినా, అది బాగా పాతది అయిపోవడం వల్లే పడిపోయి ఉంటుందని చెబుతున్నారు. అయితే, అది పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TajMahal  Chandelier  crash  British era  Tajmahal in Delhi  

Other Articles