Finally Indian Intelligence Officials Found Dawood Ibrahim Address | Pakistan | 1993 Mumbai Blasts

Indian intelligence officials found dawood ibrahim address

Dawood Ibrahim news, 1993 mumbai blasts, Dawood Ibrahim address, indian intelligence bureau, Dawood Ibrahim crime news, Dawood Ibrahim crimes, Dawood Ibrahim updates, Dawood Ibrahim address found, Dawood Ibrahim attacks, mumbai blasts

Indian Intelligence Officials Found Dawood Ibrahim Address : Finally Indian Intelligence Officials Found Dawood Ibrahim Address.

ఎట్టకేలకు దావూద్ అడ్రస్ దొరికిందోచ్.. కానీ?

Posted: 08/22/2015 10:21 AM IST
Indian intelligence officials found dawood ibrahim address

1993 ముంబై దాడుల్లో ప్రధాన నిందితుడే కాక దేశంలో ఎన్నో ఉగ్రవాద దాడులకు కుట్రలు పన్నిన దావూద్ ఇబ్రహీం.. పాకిస్థాన్లో నక్కి వున్న విషయం తెలిసిందే! అయితే.. అతని కచ్చితమైన చిరునామా కోసం భారత నిఘా వర్గాలు ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు అతగాడి అడ్రస్ నిఘా వర్గాలకు తెలిసిపోయింది. తన భార్య మెహజబీన్ షేక్, కొడుకు మొయీన్ నవాజ్, కూతుళ్లు మహరుక్, మెహ్రీన్, మాజియా అందరితో కలిసి దావూద్ పాకిస్థాన్లోని కరాచీ నగరంలోనే ఉంటున్నట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. అందుకు పక్కా ఆధారాలు కూడా లభ్యమయినట్లు సమాచారం. వాటితో పాటు.. దావూద్ తాజా ఫొటోను కూడా భారత నిఘావర్గాలు సంపాదించాయి.

ప్రస్తుతం దావూద్ కరాచీ నగరం శివార్లలోని క్లిఫ్టన్ అనే ప్రాంతంలో వుంటున్నాడు. 2015 ఏప్రిల్ నెలలో దావూద్ ఇబ్రహీం భార్య మెహజబీన్ పేరు మీద ఉన్న టెలిఫోన్ బిల్లులను కూడా భారత నిఘా వర్గాలు సంపాదించాయి. అందులో దావూద్ చిరునామా ఇలా ఉంది.. ‘'డి-13, బ్లాక్-4, కరాచీ డెవలప్మెంట్ అథారిటీ, ఎస్సిహెచ్-5, క్లిఫ్టన్’. దావూద్ ఇబ్రహీంకు మూడు పాకిస్థానీ పాస్పోర్టులు ఉన్నట్లు తెలుస్తోంది. వాటి ఆధారంగా దావూద్ కు ఒక్క చిరునామాయే కాకుండా.. మరో రెండు వున్నట్లు అర్థమవుతోంది. వాటిలో ఒకటి.. ‘'6ఎ, ఖయబాన్ తంజీమ్, ఫేజ్ 5, డిఫెన్స్ హౌసింగ్ ఏరియా’ కాగా.. మరొకటి ‘మొయిన్ ప్యాలెస్, రెండో అంతస్థు, అబ్దుల్లా షా ఘాజీ దర్గా వద్ద, క్లిఫ్టన్, కరాచీ’. మరోవైపు.. దావూద్ కొడుకు మొయీన్కు సానియా అనే అమ్మాయితో పెళ్లయింది. అలాగే ముగ్గురు కూతుళ్లలో ఒకరైన మహరూఖ్కు పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ కొడుకు జునాయిద్తో పెళ్లయింది.

ఇదిలావుండగా.. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే వున్నాడని భారత్ ఎన్నిసార్లు చెబుతున్నప్పటికీ వారు మాత్రం అతగాడు తమ దేశంలో లేడని ఖండిస్తూ వచ్చారు. మరి.. ఇప్పుడు లభించిన తాజా ఆధారాలతో పాక్ దేశం ఏమీ మాట్లాడలేక బిత్తరపోయినట్లు తెలుస్తోంది. లేడని 1993లో ముంబై మహానగరంలో వరుస పేలుళ్లకు ప్రధాన కుట్రదారు అయిన దావూద్ ఇబ్రహీం పేరు మీద ఇంటర్పోల్ ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీచేసింది. ఆ పేలుళ్లలో 257 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dawood Ibrahim  indian intelligence bureau  mumbai blasts  

Other Articles