GHMC | TRS | Elections | KCR

Trs party plans to win in the upcoming greater hyderabad elections

GHMC, TRS, Elections, KCR, GHMC Elections, Greater Hyderabad

TRS party plans to win in the upcoming greater Hyderabad elections. TRS party moves steps to get maximum votes and maximum seats in greater hyderabad elections.

గ్రేటర్ లో గులాబిదళం గ్రేట్ ప్లాన్

Posted: 08/20/2015 03:40 PM IST
Trs party plans to win in the upcoming greater hyderabad elections

గ్రేటర్ లో గులాబీ జెండా పాతాలని టీఆర్ ఎస్ ఉవ్విళ్లూరుతోంది. జీహెచ్ ఎంసీ పీఠాన్ని దక్కించుకోవాలని తీవ్ర కసరత్తు చేస్తోంది. చేరికలు, పార్టీ పటిష్టత, అభివృద్ధి అంశాలతో మేయర్ పీఠాన్ని చేజిక్కుంచుకోవాలని భావిస్తోంది టీఆర్ఎస్. ఇప్పటికే ఆలస్యమైన జీహెచ్ ఎంసీ ఎన్నికలు డిసెంబర్ లో నిర్వహించే అవకాశం ఉంది. కోర్టు జోక్యంతో వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా... డివిజన్ల పునర్విభజన పుణ్యమా అని ఇంకా ఆలస్యమవుతోంది. డివిజన్ల సంఖ్య పెరుగుతోందని సాకుగా ఉన్నా... జీహెచ్ ఎంసీ ఎన్నికల కోసం అధికార టీఆర్ ఎస్ పార్టీ వ్యూహం మాత్రం వేరేగా ఉంది. ఈసారి ఎలాగైనా బల్దియాపై గులాబీ జెండాను ఎగురవేయాలని పక్కా ప్రణాళికలు రచిస్తోంది.

తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపినప్పటికీ గ్రేటర్ పరిధిలో టీఆర్ ఎస్ పూర్తిస్థాయిలో పట్టు సాధించలేకపోయింది. సెటిులర్లు ఎక్కువగా ఉండటం, ఓల్డ్ సిటీలో ఎంఐఎం బలంగా ఉండటం, బిజెపికి నాలుగైదు నియోజకవర్గాల్లో పట్టుండటంతో టిఆర్ ఎస్ పుంజుకోలేకపోయింది. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా అధికార పార్టీకి పెద్దగా ఆదరణ లభించ లేదు. దీంతో... ఓ ఉద్యమంలా చేసి... భారీగానే సభ్యుల సంఖ్యను నమోదు చేసుకుంది. గత కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న జిహెచ్ ఎంసి ఎన్నికలపై కన్నేసింది.

మరోవైపు అభివృద్ధి ఫలాలు కూడా ఇంకా కనిపించకపోవడంతో ఎన్నికల నిర్వహణను వాయిదా వేస్తూ వస్తోంది అధికార పార్టీ. హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చిదిద్దడం, స్వచ్ఛ హైదరాబాద్, బస్తీబాట, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపులాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల పల్స్ పట్టుకునే ప్రయత్నం చేస్తోంది. హైదరాబాద్ నగరాభివృద్ధిలో భాగంగా... తాగు నీటికి మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. అటు సెటిలర్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తోంది. అయితే... పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా... గ్రేటర్ పరిధిలో పట్టు చిక్కకపోవడంతో ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అన్ని పార్టీల్లోని కీలక నేతలను కారెక్కించింది టీఆర్ ఎస్. ఇంకా ముఖ్య నేతల వలసలను ప్రోత్సహిస్తూనే... డివిజన్ స్థాయిల్లో గెలుపు గుర్రాలను గుర్తించే పనిలో పడింది. ఇంత చేసీ, అనువైన పరిస్థితులు కోసం ఆచి తూచి అడుగులు వేస్తోంది అధికార పార్టీ. ఓవైపు కోర్టు ఆదేశాలు ఎన్నికలకు తొందర పెడుతున్నాయి. దీంతో అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను టీఆర్ ఎస్ వినియోగించుకుంటోంది. మరి జిహెచ్ ఎంసిపై గులాబీ జెండా రెపరెపలాడుతుందా? లేదా? నగర ప్రజల విలక్షణ తీర్పునిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఎలా ఉంటుందో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  TRS  Elections  KCR  GHMC Elections  Greater Hyderabad  

Other Articles