pawan Kalyan | twitter | Landpooling | Janasena News

Pawan kalyan tweeted his feeling about the development

pawan Kalyan, twitter, pawan KaLyan Tweets, Pawan Kalayan Tweets about landpooling, Janasena News, Janasena pawan Kalyan

Pawan Kalyan tweeted his feeling about the Development. The development need all areas and all groups development.. but our leaders not doing like this.

అభివృద్ది అలా చెయ్యాలి.. సంచలనం రేపుతున్న పవన్ పిట్ట

Posted: 08/19/2015 01:44 PM IST
Pawan kalyan tweeted his feeling about the development

జనసేన పార్టీ అధినేత, తెలుగు సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ట్వీట్ చేశారు. బాధ్యత గల లీడర్, బాధ్యత గల ప్రభుత్వాలు ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో తన ట్వీట్ లో తెలియజెప్పారు పవన్ కళ్యాణ్. గతంలో కూడా తన ట్వీట్ ల ద్వారా జనాలకు చేరువైన పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్ ప్రతి వ్యక్తిని ఆలోచన చేసేంతలా ఉంది. ప్రజా నాయకులు అంటూ చేస్తున్న అభివృద్ది మీద నిజాలు ఎలా ఉన్నాయి.. ఎలా ఉండకూడదు అని పవన్ తన ట్వీట్ లో వెల్లడించారు. గతంలో పవన్ రాజధాని భూముల మీద చేసిన ట్వీట్ ఎంత దుమారం రేపిందో అందరికి తెలుసు. తాజాగా మరోసారి కూడా అదే అంశం మీద మరింత విజన్ ఉన్న నాయకుడు చేయాల్సిన దాని మీద తన ట్వీట్ లో వివరించారు.

 

 

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం భూసేకరణ చేపట్టబోతుండటంపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి ట్విట్టర్ లో స్పందించారు. సారవంతమైన, పలు రకాల పంటలు పండే  ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, ఇతర నదీముఖ గ్రామాల్లో పంట భూములను భూసేకరణ చట్టం కింద స్వాధీనం చేసుకోవద్దని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నట్టు పవన్ తెలిపారు. తక్కువ నష్టంతో అభివృద్ధి జరిగేలా పాలకులు వివేచనతో ఆలోచించాలని సూచించారు. దేశం ఏదైనా, పాలకులు ఎవరైనా ఒక ప్రాంత అభివృద్ధిపై లేదా సమూహ అభివృద్ధికి మాత్రమే పాటుపడవద్దన్నారు. అలా జరిగితే వాతావరణ కాలుష్యం, స్థానిక స్థానభ్రంశంతో పాటు ఇతర సమూహాల ఆగ్రహానికి గురి కావల్సి ఉంటుందని పవన్ పేర్కొన్నారు. అందుకే రాజధాని ప్రాంతంలో ఇష్టంలేని రైతుల భూములపై భూమి సేకరణ చట్టం ఉపయోగించవద్దని టీడీపీ ప్రభుత్వానికి విన్నవిస్తున్నానని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles