China | India | Manufaturing

India turn to become factory of the world said chinese media

China, India, Manufaturing, china products, Indian, Make in India

India turn to become factory of the world said Chinese media It is now India's turn to emerge as the "factory of the world", according to an article in Chinese official media, citing the economic downturn in China forcing companies to turn to India for manufacturing. Plans by China's phone maker Xiaomi and Taiwan's Foxconn to invest in India point to strong movement of Chinese firms to cash on growing Indian market.

మన దెబ్బకు చైనా చడ్డి తడుస్తోంది

Posted: 08/19/2015 12:04 PM IST
India turn to become factory of the world said chinese media

ఇండియాలో యువ శక్తి అంతకంతకు పెరుగుతోంది. భారత్ లో గత కొంత కాలంగా జరుగుతున్న హ్యూమన్ రిసోర్స్ వల్ల ప్రపంచ మార్కెట్ మన వైపే చూస్తోంది. అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో కంటే వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో ముందున్న భారత్ వైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చూస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగడమూ కాకుండా రానున్న కొన్ని సంవత్సరాల్లో వరల్డ్ ఎకానమి రూపు రేఖలను మార్చే సత్తా ఉన్న బారత్ గురించి చైనా భయపడుతోంది. పక్కలో బల్లెంలా తయారైన చైనా ఇప్పుడు మనల్ని చూసి భయపడుతోంది. భారత్ మీద కారాలు మిరియాలు నూరే చైనా మాత్రం భారత్ గురించి చాలా భయపడుతోంది. భవిష్యత్ లో భారత్ వల్ల తమ దేశానికి, తమ ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఉంటుందని ఆ దేశం భయపడిచస్తోంది.

భారత్ లో గత కొంత కాలంగా ప్రారంభమైన మేకిన్ ఇండియా వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఊతం లభించింది. బారత్ లో సర్వీస్ సెక్టార్ అంతకు ముందే చాలా బలంగా ఉంది.. కానీ మ్యానుఫాక్చరింగ్ రంగంలో మాత్రం వెనుకబడింది. చైనాకు అదే రంగం బలం.. మనకు మాత్రం అది బలహీనత అందుకే భారత్ లో తయారీతో భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్తేజాన్ని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే భారత్ లో జరుగుతున్న మేకిన్ ఇండియా గురించే చైనా భయపడుతోంది. భారత్ లో కూడా మ్యాన్ పవర్ చాలా ఉంది.. మ్యానుఫ్యాక్చరింగ్ లో భారత్ ముందుకు వెళితే మాత్రం దాని దూకుడును అడ్డుకోవడం చైనా వల్ల కాదు అని ఆ దేశం భయపడుతోంది. అందుకే భారత్ లో తయారీ పట్ల చాలా భయంగా ఉంది చైనా. అలాగే చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ కూడా భారత్ రానున్న కాలంలో ప్రపంచ తయారీ రంగానికి ఖార్ఖానాగా తయారవుతోందని కథనాన్ని వెల్లడించడం నిజంగా విశేషం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  India  Manufaturing  china products  Indian  Make in India  

Other Articles