Nagam Janardhan Reddy Staying Away From Bjp Party | Bachao Telangana programme | Telangana Party

Nagam janardhan reddy bachao telangana bjp party resignation yennam srinivas reddy

nagam janardhan reddy, bachao telangana, telangana state, yennam srinivas reddy, telangana schemes, trs party, bjp party, tdp party, tdp ministers, bjp party ministers, bjp party schemes, nagam janardhan reddy controversies, bachao telangana programme

Nagam Janardhan Reddy Bachao Telangana Bjp Party Resignation Yennam Srinivas Reddy : Nagam Janardhan Reddy Staying Away From Bjp Party Along With Former MLA Yennam Srinivas Reddy.

బీజేపీకి బుసకొట్టిన ‘నాగం’

Posted: 08/19/2015 10:46 AM IST
Nagam janardhan reddy bachao telangana bjp party resignation yennam srinivas reddy

ఏదైనా పార్టీలో కొనసాగే రాజకీయ నాయకులకు అంతగా గుర్తింపు లభించకపోతే ఏం చేస్తారు..? అధికారంలో వున్న పార్టీలో లేక ప్రాభవం వున్న పార్టీలోకి జంప్ అవుతారు. ఒకవేళ సదరు నేతకు మంచి అనుభవం వుండి, నలుగురిలో గుర్తింపు వుంటే స్వయంగా పార్టీ పెట్టేసుకుంటారు. జనాల్లో మమేకమయ్యేందుకు రకరకాల పద్ధతుల్ని అనుసరిస్తారు. ఇప్పుడు నాగం జనార్ధన్ రెడ్డి వ్యవహారశైలి గమనిస్తుంటే.. ఇలాగే అనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో సీనియర్ మంత్రేకాక టీడీపీలో కీలక నేతగా వ్యవహరించిన నాగం జనార్ధన్ రెడ్డి ప్రాభవం రాష్ట్ర విభజన తర్వాత క్రమంగా కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన.. తిరిగి తన ఇమేజ్ ని పొందేందుకు సరికొత్త ప్రణాళికలను అవలంభిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్ర విభజనకు ముందు టీడీపీ పార్టీలో కొనసాగుతూ నాగం జనార్ధన్ రెడ్డికి ఓ రేంజులో వుండేవారు. కానీ.. విభజన తర్వాత ఈయన ప్రాభవం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన ఆయన.. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, కొంత కాలంపాటు సైలెంట్ గానే ఉన్నారు. అలాగే ఉండిపోతే తన ఇమేజ్ పూర్తిగా దెబ్బతింటుందన్న అభిప్రాయంతో ఆయన కొన్నాళ్ల తర్వాత బీజేపీలోకి చేరిపోయారు. ఆ పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందెందుకు కష్టపడినప్పటికీ.. ఆయన పొసగలేకపోయారు. ఈ క్రమంలోనే ఆయన కాస్త తెలివిగా ఆలోచించి ఓ అడుగు ముందుకెశారు. బీజేపీలో కొనసాగుతూనే సాగు నీటి ప్రాజెక్టులపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో ‘బచావో తెలంగాణ’ పేరిట తెలంగాణ వ్యాప్తంగా పర్యటించారు. అయితే ఈ యాత్రలే ఆయనను బీజేపీకి దూరం చేసినట్లు తెలుస్తోంది.

కేవలం నాగం జనార్ధన్ మాత్రమే కాదు.. ఆయనతోపాటు ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ కు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిని కూడా ఆ యాత్రలే పార్టీకి దూరం చేశాయనే చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ పార్టీలో అంతగా గుర్తింపు లేదు. వీరిద్దరినీ పట్టించుకునే నాధుడే లేడు. దీంతో భగ్గుమన్న ఈ ఇద్దరు నేతలు ‘బచావో తెలంగాణ’ కార్యక్రమాన్నే ప్రజా వేదికగా మార్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీకి కటీఫ్ చేస్తున్నట్లు బహిరంగంగా వారిరువురు ప్రకటించకపోయినా.. ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరూ హైదరాబాదులోని బషీర్ బాగ్ లో ఓ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారని సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే.. నాగం, యెన్నం ఇద్దరూ బీజేపీకి దూరమైనట్టేనన్న అనుమానాలు స్పష్టమవుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagam janardhan reddy  bachao telangana  yennam srinivas reddy  

Other Articles