TPSC | Telangana | Jobs

Telangana public commission plpans to release job notification in the evening

TPSC, Telangana, Jobs, employeement, KCR, Govt Jobs

Telangana public commission plpans to release job notification in the evening. TPSC plans to release first job notification after the formation of state of Telangana.

సోదరా.. నోటిఫికేషన్లకు వేళాయెరా

Posted: 08/19/2015 09:46 AM IST
Telangana public commission plpans to release job notification in the evening

ఎంతో కాంలగా ఎదురు చూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్ల జారీకి అంతా సిద్దమైంది. టిఎస్‌పిఎస్సీ ద్వారా 3,783 పోస్టులు, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 9,058 పోస్టులు, విద్యుత్‌ శాఖ ద్వారా 2,681 పోస్టుల చొప్పున మొత్తం 15,522 పోస్టులను నేరుగా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అందులో ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి ప్రాధాన్యమిస్తున్నట్లు సమాచారం. తొలి నోటిఫికేషన్‌ ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి సంబంధించే విడుదల చేస్తారని తెలుస్తోంది. పంచాయితీరాజ్‌ అండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖలో గ్రామీణ నీటి సరఫరా శాఖ కింద 161 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, 243 అసిస్టెంట్‌ ఇంజినీర్లు భర్తీకి చర్యలు చేపట్టనున్నారు. వాటర్‌గ్రిడ్‌ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ వస్తుందని తెలిసింది. వీటితోపాటు నీటిపారుదల శాఖలో 252 అసిస్టెంట్‌ ఇంజినీర్లు, 159 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, పురపాలక శాఖలో 389 అసిస్టెంట్‌ ఇంజినీర్లు, 126 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సేవరేజ్‌ బోర్డులో 146 మేనేజర్‌ ఇంజినీర్లు, రవాణా, రోడ్డు భవనాల శాఖలో 42 అసిస్టెంట్‌ ఇంజినీర్లు, 83 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ల పోస్టుల చొప్పున మొత్తం 1,601 పోస్టులు భర్తీ కానున్నాయి.

ఈ రోజు సాయంత్రం షెడ్యూల్‌ విడుదల చేసి, ఈ నెలాఖరులోగా తొలి నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి కమిషన్‌ ఏర్పాట్లు సిద్ధం చేసింది. బుధవారం సాయంత్రం టిఎస్‌పిఎస్సీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఉద్యోగ ప్రకటనల వివరాలు, షెడ్యూల్‌, తేదీల ఖరారును వివరించనున్నట్లు తెలిసింది. వచ్చేనెల తొలివారంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ లోపే ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ చేసి ప్రతిపక్షాలకు ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనిని పరిగణనలోకి తీసుకొని నోటిఫికేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలని టిఎస్‌పిఎస్సీని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఆ దిశగానే ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి అన్ని అంశాలనూ పకడ్బందీగా పరిశీలిస్తోంది. న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TPSC  Telangana  Jobs  employeement  KCR  Govt Jobs  

Other Articles