Modi | Bihar | Elections | Narendra Modi

Pm modi announces one crore twenty five lakhs crore package for bihar

Modi, Bihar, Elections, Narendra Modi, Bihar Elections, nitesh Kumar

Pm modi announces one crore twenty five lakhs crore package for Bihar At a function in Bihar's Arrah, Prime Minister Narendra Modi made the announcement that the election-bound state has been waiting for - he has promised the state Rs. 1.25 lakh crore in central funds for development.

బీహార్ కు పెద్ద బుట్ట పట్టుకెళ్లిన మోదీ

Posted: 08/18/2015 03:22 PM IST
Pm modi announces one crore twenty five lakhs crore package for bihar

వడ్డించే వాడు మనోడైతే బంతి చివర్లో కూర్చున్నా.. మనకు రావాల్సిన భోజనం మనకు వస్తుంది అన్న సామెతను వినే ఉంటారు. కేంద్ర ప్రభుత్వం అయినా.. రాష్ట్ర  ప్రభుత్వమైనా.. ఆ పార్టీ అయినా.. ఈ పార్టీ అయినా.. ఏ పార్టీ అయినా ఎలక్షన్స్ వస్తే చాలు వరాల మీద వరాలు.. హామీల మీద హామీలు ఇచ్చి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా బీహార్ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ కూడా ఇదే విషయాన్ని ఫాలో అవుతున్నారు. అసలే నితీష్ కుమార్ కు మోదీకి అస్సలు పొసగదు అని భారతదేశంలో ఉన్నవాళ్లందరికి తెలుసు. నితీష్ కుమార్ కు అధికారాన్ని దూరం చెయ్యాలని.. ఈ సారి ఎలాగైనా బీహార్ లో పాగా వెయ్యాలని నరేంద్రమోదీ పథకాలను రచిస్తున్నారు. అందుకే ఎలక్షన్ ల సమయంలో ప్రతి పార్టీ ఇచ్చే లాంటి ఓ బంపర్ ఆఫర్ ను మోదీ కూడా ప్రకటించారు. ఎంతో కాలంగా వినిపిస్తున్న డిమాండ్ కు దగ్గరగా ఉండే ఓ బంపర్ ఆఫర్ ప్రకటించి అక్కడి వారి ఓట్లను కొట్టేయాలని ఆలోచిస్తున్నారు.

బీహార్ అంటేనే వెనుక బడిన రాష్ట్రాల జాబితాలో ముందుండే ఓ రాష్ట్రం. గత కొంత కాలం నుండి పరిస్థితి కాస్త మేలు అని అనిపిస్తున్నా పరిస్థితి మొత్తం ఇంకా మారనే లేదు. అందుకే బీహార్ కు ప్రత్యేక హోదా కల్పించండి బాబూ అంటూ ఎంతో కాలంగా డిమాండ్ వినిపిస్తూ ఉంది. అయితే గత ఎన్నికల తర్వాత బిజెపి పార్టీలో ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చెయ్యాలంటే బీహార్ ఎన్నికల్లో గెలిచి అటు పార్టీలో.. ఇటు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పోరును తప్పించుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు మోదీ. అందుకే తాజాగా బీహార్ కు కోటి ఇరవై ఐదు లక్షల కోట్ల ప్యాకేజీని ఇవ్వనున్నట్లు మోదీ ప్రకటించారు. అదనంగా మరో యాభై వేల కోట్లు విడుదల చెయ్యడానికి కూడా సిద్దంగా ఉన్నామని కూడా మోదీ ప్రకటించారు. మొత్తానికి బీహార్ ప్రజల ఓట్లను కొట్టేయడానికి మోదీగారు పెద్ద బుట్టనే పట్టుకెళ్లారు. మరి ఈ ప్యాకేజీ బుట్టలో బీహార్ ప్రజలు పడతారో లేదా మోదీ గారి పార్టీనే బుట్ట సర్దుకునేలా చేస్తారో చూడాలి. ఇది తేలాలంటే మాత్రం బీహార్ ఎలక్షన్ ల దాకా ఆగాల్సిందే.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Bihar  Elections  Narendra Modi  Bihar Elections  nitesh Kumar  

Other Articles