Pawan Kalyan threats to go on hunger strike against land acquisition

Pawan kalyan urges govt not to acquire land from unwilling farmers

Pawan Kalyan Tweets about Land Aquisition act and TDP's Decision, Pawan Kalyan Latest Tweets, Pawan Kalyan indefinite hunger strike, Pawan Kalyan Tweets against Govt aquiring lands, capital region, janasena party, Pawan Kalyan, AP government, land acquisition plan, farmers land, capital amaravathi region

janasena party president Pawan Kalyan threatened to go on an indefinite hunger strike if the government tries to 'forcibly' acquire land from farmers

బలవంత భూసేకరణ వద్దు.. మరోమారు పనన్ ట్విట్..

Posted: 08/17/2015 08:43 AM IST
Pawan kalyan urges govt not to acquire land from unwilling farmers

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి ప్రాంత రైతులకు అండగా వుంటానని చెప్పిన ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సారి తన స్వరాన్ని మార్చాడు. అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చేందుకు అంగీకరించని రైతులపై భూసేకరణ చట్టం అమలు చేయవద్దని గురువారం పవన్ ట్విట్ చేసిన తరువాత అందదుకు సమ్మతిస్తూనే.. పురపాలక శాఖా మంత్రి నారాయణ మరో మెలికపెట్టిన నేపథ్యంలో పవన్ మరోమారు రైతులకు అండగా నిలిచాడు.

ఏడాదికి రెండు, మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి లాక్కునేందుకు భూసేకరణ చట్టం అమలు చేయవద్దని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. రాజధానికి భూములు అవసరమని ప్రభుత్వం భావిస్తే యజమానుల సమస్యల్ని పరిష్కరించి.. సామరస్య వాతావరణంలోనే తీసుకోవాలని ఇటీవల ఆయన ప్రభుత్వానికి సూచించారు. అయినా ఈ నెల 20 లోపు పుల్లింగ్ ద్వారా.. ఆ తరువాత భూసేకరణ ద్వారా సేకరిస్తామని మంత్రి నారాయణ స్పందించడంపై పవన్ కల్యాన్ మడిపడినట్లు జనసేన వర్గాలు అంటున్నాయి. అందకనే భూసేకరణ చట్టాన్ని బలవంతంగా అమలు చేయవద్దని మరోమారు పవన్ ట్విట్ చేసినట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles