mumbai | Wiper | Car | Bonnet

Man dragged on car bonnet for 300 meters

mumbai, Wiper, Car, Bonnet, Driver, CCTV

A spine-chilling incident of road rage has been captured by security camera in Mumbai. The incident, which was no less than an action movie took place on July 27, when a car driver hit a Volvo bus driver and smashed the winshield of the Volvo by a bat in Navi Mumbai. When the car driver tried to escape, the bus driver jumped over the car bonnet and got hold of the wiper.

ITEMVIDEOS: సినిమాల్లోలాగా కార్ ముందు వేలాడపడ్డాడు

Posted: 08/13/2015 12:53 PM IST
Man dragged on car bonnet for 300 meters

సినిమాల్లో హీరోలు కార్లతో చేసే ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. కార్లను బోల్తా కొట్టించడం, వీలైతే ఒంటి చేత్తో కార్లను మట్టికరిపించడం లాంటి ఫీట్లు ఇప్పుడు సర్వసాధారణం అయిపోయాయి. ఇక కదులుతున్న కార్లమీదకు జంప్‌ చేయడం, ఒంటి మీద చిన్న గీత కూడా పడకుండా తప్పించుకోవడం లాంటివి ఎన్నో ఛేజింగ్‌ సీన్లలో చూసే ఉంటాం. కానీ ఇలాంటి ఫీట్లు నిజజీవితంలో ఊహకు కూడా అందవు. ఎందుకంటే కదులుతున్న కారుకు ఎదురెళ్లడం అంటే ప్రాణాలతో చెలగాటమే. కానీ ఇలాంటి చెలగాటానికి ఒక వ్యక్తి సై అంటూ ఎదురెళ్లాడు. సినీఫక్కీలో జరిగిన సంఘటనవీ ముంబాయిలో చోటుచేసుకుంది. ఇదేదో మామూలు యాక్సిడెంట్‌ కాదు. కారు వైపర్‌ను పట్టుకుని వేలాడుతున్న ఈ వ్యక్తి తన పంతం నెగ్గించుకునేందుకు ఏకంగా కారుకి ఎదురెళ్లాడు. అచ్చం సినిమాల్లో లాగే.. జరిగిన ఈ ఘటన నవీ ముంబాయిలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘటనలో ఓ కారు డ్రైవర్ అతడి కారుపై మరో వ్యక్తి వేలాడుతున్నా ఏమాత్రం లక్ష్య పెట్టకుండా దాదాపు 300 మీటర్లు నడిపాడు.

 



అసలు విషయానికి వస్తే నవీ ముంబయిలో ఓ కారు డ్రైవర్, ఓ బస్సు డ్రైవర్తో గొడవపడ్డాడు. అంతేకాదు చేయి చేసుకున్నాడు కూడా. ఆ వెంటనే పారిపోయేందుకు కారు డ్రైవర్ ప్రయత్నం చేస్తుండగా బస్సు డ్రైవర్ వెళ్లి ఏకంగా కారు ముందు భాగంపై దూకాడు. అయినా, అతడు కారు వేగంతో ముందుకు పోనివ్వడంతో బస్సు డ్రైవర్ కిందపడకుండా కారు వైపర్ సహాయంతో ఆగి ప్రాణాలు దక్కించుకున్నాడు. చివరకు కారు 300 మీటర్లు దూసుకెళ్లి ఆగింది. కారు నడిపిన ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. బస్సు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mumbai  Wiper  Car  Bonnet  Driver  CCTV  

Other Articles