Kadiyam Srihari Make Settarical Story On Errabelli Dayakar Rao Comments | TDP | TRS

Kadiyam srihari bull dog story settairs on errabelli dayakar rao

kadiyam srihari, errabelli dayakar rao, tdp party, trs party, kadiyam srihari controversies, errabelli controversies, telugu desam party, telangana rashtra samithi, bull dog story, kadiyam bull dog story

Kadiyam Srihari Bull-Dog Story Settairs On Errabelli Dayakar Rao : Kadiyam Srihari Make Settarical Story Of Bull-Dog On Errabelli Dayakar Rao Comments.

‘ఎద్దు-కుక్క’ కథ.. ఎర్రబెల్లిపై కడియం కౌంటర్!

Posted: 08/13/2015 10:38 AM IST
Kadiyam srihari bull dog story settairs on errabelli dayakar rao

రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తరచూ విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం. కానీ.. ఈసారి అందుకు భిన్నంగా తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తనదైన శైలిలో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై సెటైర్లు వేశారు. నేరుగా ఎర్రబెల్లిపై వ్యాఖ్యలు గుప్పించకుండా.. ‘ఎద్దు-కుక్క’ కథతో పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు.

ఇటీవలే కడియంపై ఎర్రబెల్లి తీవ్రస్థాయిలో మండిపడుతూ.. తాను చెబితేనే కడియంకు మంత్రి పదవి వచ్చిందని, అది తన భిక్షే అంటూ వ్యాఖ్యానించారు. అందుకు కౌంటర్ గా కడియం ‘ఎద్దు-కుక్క’ కథను తెరమీదకు తీసుకొచ్చారు. బుధవారం సచివాలయంలో విద్యాశాఖపై సమీక్ష అనంతరం కడియం శ్రీహరి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగానే ‘ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలపై మీ సమాధానం ఏంటి?’ మీడియా ప్రతినిధి ఒకరు ప్రశ్నించారు. ఇందుకు జవాబుగా ఆయన తొలుత తనకు ఎర్రబెల్లి వ్యాఖ్యలపై స్పందించడం ఇష్టంలేదని పేర్కొన్న ఆయన.. ప్రజల కోసమైనా చెప్పాల్సిందేనని అన్నారు.

ఈ క్రమంలోనే ఆయన ఎద్దు-కుక్క కథను చెప్పుకొచ్చారు. ‘ఎండాకాలంలో ఒక రైతు బావి వద్ద ఉన్న గడ్డిని తన ఎడ్ల బండిలో నింపుకుని ఇంటికి వస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఎక్కడ్నుంచో ఆ దారిలో వచ్చిన ఓ కుక్క.. ఎండ వేడిమి తట్టుకోలేక బండి కింద నీడలో నడుస్తూ ఇంటివరకు వచ్చింది. ఇంటికి వచ్చాక బండి కింది నుంచి బయటకు వచ్చి ‘అబ్బ! ఇంత పెద్ద బండిని అక్కడ్నుంచి లాక్కొచ్చిన’ అని అనుకుందంట. అప్పుడు అదే బండిని లాక్కొచ్చిన ఎద్దువైపు ఆ కుక్క చూసింది. అప్పుడు ఎద్దు కొంత ఆయాస పడుతోంది. ‘నేను సునాయాసంగా లాక్కొచ్చాను.. నీవు ఇంత లావువున్నావు.. నీవెందుకు ఆయాస పడుతున్నావు..’ అని కుక్క ఆ ఎద్దును అడిగిందట. అప్పుడు ఎద్దు కుక్క వైపు చూసి.. పాపం ఈ కుక్కకు ఏమి తెలియదని సెలైంట్‌గా ఉందట. కానీ ఆ కుక్క ఎద్దును ఎక్కిరిస్తూ పోయిందట. ‘హా.. అది ఎంతైనా కుక్కే కదా!’ అని ఎద్దు అనుకుందట.’’ అని కడియం ఆ కథను చెప్పారు.

ఈ విధంగా ఆయన ఆ కథను వెల్లడించిన అనంతరం ఓ మీడియా ప్రతినిధి.. ‘మీరు ఎర్రబెల్లిని కుక్కతో పోల్చుతున్నారా’ అని ప్రశ్నించారు. అందుకు బదులుగా ఆయన తెలివైన సమాధానమే ఇచ్చారు. తాను ఆ మాట తాను, మేధావులైన మీకు అర్థమై ఉందనుకుంటానని విలేకరులతో అన్నారు. ‘ఆయన నా పుట్టుకను, నా కులాన్ని, రాజకీయాన్ని కాంట్రవర్సీ చేయాలని చూస్తాడు. అవకాశాలు కలిసి వచ్చాయి. నేనేం చేయాలి’ అని చివరగా పేర్కొన్నారు. తాను అవినీతికి పాల్పడినట్లు, కులాన్ని తప్పుగా చూపించినట్లు ఆధారాలతో వస్తే పదవికి రాజీనామా చేస్తానని, ప్రజలకు క్షమాపణ చెబుతానని స్పష్టంచేశారు. తనను, తన కులాన్ని అవమానిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kadiyam srihari  errabelli dayakar rao  bull dog story  

Other Articles