Chandrababu Naidu | AP | PuliRaja

Ap am chandrababu naidu willbe puliraja for the state of ap

Chandrababu Naidu, AP, PuliRaja, Special status, Opposition leaders, NDA, modi

AP AM Chandrababu naidu willbe PuliRaja for the state of ap. Opposition parties are targetting chandrababu naidu for his step back on special status.

ఏపి పులిరాజాగా మిగలనున్న చంద్రబాబు..!

Posted: 08/13/2015 09:37 AM IST
Ap am chandrababu naidu willbe puliraja for the state of ap

పులిరాజా అంటే అందరికి తెలుసు. ఓ వ్యాధి మీద జనాలను చైతన్యం చెయ్యడానికి చేసిన విస్రృత ప్రచారంలో పులిరాజా పేరు బాగా పాపులర్ అయింది. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా..? అంటూ ప్రభుత్వం చేసిన ప్రచారం ఢిల్లీ నుండి గల్లీకి చేరింది. అప్పటిదాకా తెలియని ఎయిడ్స్ గురించి అందరికి తెలిసిపోయింది. దాంతో ప్రజలు ఎయిడ్స్ మీద అవగాహన పెంచుకున్నారు. ఫలితంగా మరికొంత మంది ఆ మహమ్మారి బారిన పడకుండా తప్పించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పులిరాజా ప్రస్తావన తీసుకువచ్చాం. ఏపిలో ప్రస్తుత పరిస్థితుల ఫలితంగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడు పులిరాజాగా మారతారా..? అనే ప్రశ్న వస్తోంది. అసలు పులిరాజా యాడ్ వేరే ఉద్దేశంతో కదా ప్రారంభించారు.. మరి మీరేంటి చంద్రబాబు నాయుడు పులిరాజా అవుతాడా...? అంటూ ప్రశ్నిస్తున్నారు అని అనుకుంటున్నారా.? దానికి సమాధానం ఉంది. కానీ అక్కడి పులిరాజాకు, మేము చెబుతున్న పులిరాజాకు తేడా ఉంది.

ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికి గతంలో ప్రభుత్వం పులిరాజా అనే క్యారెక్టర్ ను తెర మీదకు తీసుకువస్తోంది. అయితే ప్రస్తుతం ఏపిలో ఓ ఉద్యమం నడుస్తోంది. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ అక్కడి ప్రజలు, నాయకులు, అందరూ కలిసి ఉద్యమ బాట పట్టారు. ఇప్పటికే దగా పడ్డ ఏపికి కనీసం ప్రత్యేక హోదా కల్పించడం ద్వారా అయినా సరే న్యాయం చెయ్యాలని.. తాము అభివృద్ది చెందడానికి సహకరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అసలు వైఖరి ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. ఒకసారి అవునంటారు.. మరోసారి కాదంటారు. మొత్తానికి ప్రత్యేక హోదా మీద కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతోంది. ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడును పులిరాజాను చేస్తోంది. అవును కేంద్రం అవలంభిస్తున్న అస్పష్టవైఖరి నారా చంద్రబాబు నాయుడును పులిరాజాను చేస్తోంది.

చంద్రాబాబు నాయుడు పులిరాజా ఎలా అవుతారు .? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదా..? ముందు గతంలో వచ్చిన పులిరాజా యాడ్ గురించి తెలుసుకుందా. ఎయిడ్స్ అనే వ్యాధి ఎంతో భయంకరమైంది.. దాని మీద అవగాహన కల్పించాలంటే ప్రజలకు చేరువయ్యేలా ఓ క్యారెక్టర్ ను తీసుకురావాలని పులిరాజా అనే క్యారెక్టర్ ను క్రియేట్ చేశారు. మీలో ఎవరు పులిరాజా అనగానే జనాలు పులిరాజా ఎవరు అని ఆలోచించడం మొదలుపెట్టారు. అలా ప్రస్తుతం కూడా ఏపికి అన్యాయం జరగకుండా ప్రత్యేక హోదీ మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే దానికి సరైన బ్రాండ్ అంబాసిడర్ కావాలి. అందుకే ప్రతిపక్షాలు అన్నీ కలిసి చంద్రబాబు నాయుడును తమ బ్రాండ్ అంబాసిడర్ గా వాడుకుంటున్నాయి. చంద్రబాబు అంటే ఇలా ఉన్నారు... అందుకే ఏపికి ప్రత్యేక హోదా రావడం లేదు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కన్నెత్తి చూడటం లేదు.. పళ్లెత్తి మాట్లాడటం లేదు అని అన్ని పక్షాలు కలిసి ప్రచారం చేస్తున్నాయి. మొత్తానికి ప్రత్యేక హోదా రాకుండా బాబు గారు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తే ప్రతిపక్షాల లక్ష్యం నెరవేరుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  AP  PuliRaja  Special status  Opposition leaders  NDA  modi  

Other Articles