Facebook | Privacy | Phonhe numbers

Facebook loophole makes your phone number a data hacking tool

Facebook, Privacy, Phonhe numbers, hacking, facebook users, Data Hacking Tool

Facebook Loophole Makes Your Phone Number a Data Hacking Tool It's that time of the month again where we urge you all to double-check your Facebook settings or face the potential for your personal data to be harvested and used nefariously by the nebulous web boogeyman.

ఫేస్ బుక్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్త

Posted: 08/12/2015 12:52 PM IST
Facebook loophole makes your phone number a data hacking tool

ఫేస్ బుక్ లో గంటలు గంటలు ఛాటింగ్ చేసి దానికి బాగా అడిక్ట్ అయిన వారికి వార్నింగ్. మీ ఫేస్ బుక్ అకౌంట్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఓపెన్ చెయ్యడం.. మీ లాగా అతడు ఏదో కామెంట్ చెయ్య్డడం తర్వాత అది వివాదాస్పదం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇంతకీ విషయం ఏంటీ అంటే మీ అకౌంట్ లో ప్రొఫైల్లో ఫోన్ నెంబర్ ఫీడ్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. యూజర్స్, పిక్చర్స్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేయమంటూ ఫేస్‌బుక్ యాజమాన్యమే యూజర్స్‌ను ఇటీవల ప్రోత్సహిస్తోంది. అలా చేసినట్లయితే ఏ యూజర్ తన ప్రైవసీ సెట్టింగ్స్‌ను పెట్టుకున్నా అతని ఫోన్ నెంబర్ ద్వారా ఆ యూజర్ పేరును, పిక్చర్‌ను, లొకేషన్‌ను, ఇతరత్రా సమాచారాన్ని ఇట్టే దొంగలించవచ్చని, అతని ఫేస్‌బుక్ ఖాతాలోకి వెళ్లి కామెంట్స్ కూడా చేయవచ్చని బ్రిటన్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిరూపించారు.

ఫేస్‌బుక్ ఓపెనింగ్ టైపింగ్ బార్‌పై ఎవరి ఫోన్ నెంబర్‌ను టైప్ చేసినా వారికి సంబంధించిన ప్రొఫైల్, ఫొటో, లొకేషన్, ఇతరత్రా వివరాలు తెలుసుకోవచ్చని బ్రిటన్‌కు చెందిన సాల్ట్ డాట్ ఏజెన్సీ టెక్నికల్ డెరైక్టర్ రెజా మొయావుద్దీన్ తన బ్లాగ్‌లో తెలియజేశారు. తాను బ్రిటన్, అమెరికా, కెనడాకు చెందిన ప్రాబబుల్ నెంబర్లను ర్యాండమ్‌గా కొన్ని లక్షల్లో ఫేస్‌బుక్ యాప్ బిల్డింగ్ ప్రోగ్రామ్ కు పంపించానని, ఆ ఫోన్ నెంబర్లను ట్యాలీ అయిన ప్రతి యూజర్ ప్రొఫైల్, ఇతరత్రా వివరాలు తనకు అందాయని ఆయన తెలిపారు.

ఈ మధ్యన అసలే సైబర్ నేరాలు మితిమీరిపోయాయి. రకరకాలుగా సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నైజీరియా వాళ్ల గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరి చేతిలో ఫోన్ ఉన్నా వారికి ఖచ్చితంగా ఫేస్ బుక్ అకౌంట్ ఉండాల్సిందే. మరి అమెరికా తర్వాత అత్యధికంగా ఫేస్ బుక్ యూజర్లను కలిగిన భారత్ తాజా వార్త షాక్ ఇచ్చింది. ఫేస్ బుక్ యూజర్లు తమ ఫోన్ నెంబర్లను ఫేస్ బుక్ ప్రొఫైల్ లో ఎంటర్ చెయ్యక పోవడం ఎంతో మేలని కొంత మంది సాఫ్ట్ వేర్ నిపుణులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Facebook  Privacy  Phonhe numbers  hacking  facebook users  Data Hacking Tool  

Other Articles