Treasury | AP | Chandrababu Naidu

Chandra babu naidu focus on how to fill the treasury

Treasury, AP, Chandrababu Naidu, Defcit budget

Chandra babu naidu focus on how to fill the treasury. AP state facing defcit in its treasury so chandrababu naidu focusing on that matter.

ఖజానా నింపడం ఎలా..? చంద్రబాబు సమాలోచనలు

Posted: 08/12/2015 10:00 AM IST
Chandra babu naidu focus on how to fill the treasury

ఆంధ్రప్రదేశ్ ఖజానా నింపడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఏడాదిన్నరలో ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా విపరీతంగా పెరగడంతో ఆదాయ మార్గాలపై ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. రెవెన్యూ పూడ్చేందుకు చంద్రబాబె నాయుడు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసలే రాజధాని లేదు.. దానికి తోడు ఓ వైపు లోటు బడ్జెట్.. విభజన తరువాత ఏపీ పరిస్థితి ఇది. ఆ కష్టాలు ఇంకాస్త పెరిగాయి ఇప్పుడు.. విభజన కారణంగా ఆర్థిక లోటుతోనే కొత్తగా ఆవిర్భవించిన ఏపీకి.. బండి నడవాలంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వేలు, పదివేలు కాదు.. ఏకంగా 90వేల కోట్ల రూపాయల వరకూ ప్రస్తుతం రాష్ట్రం రుణభారాన్ని మోయాల్సి వస్తోందని అంచనా.

సమైక్యంగా ఉన్నప్పుడు రాష్ట్రానికి లక్షా 15వేల కోట్ల రూపాయల అప్పుండేది. ఆర్థికంగా ఆస్తులేమీ లేకపోయినా జనాభా ప్రాతిపదికన విభజన జరగడంతో.. ఏపీకి 64వేల 441కోట్ల అప్పు మాత్రం వచ్చింది. తొలి ఏడాది రాష్ట్రం నడవడం కోసం 11వేల కోట్ల రూపాయలను ఓపెన్ మార్కెట్ నుంచి మళ్లీ రుణం తీసుకుంది సర్కార్. ఇక ఉద్యోగుల వేతన సవరణ, రుణమాఫీ, ఫించన్లు, ఇతర పథకాల అమలు మరింత భారంగా మారడంతో పాటు.. పాత అప్పులకే గతేడాది 16 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇలా ఖర్చు పెరుగుతూ వస్తోంది..

పెరిగిపోతున్న ఆర్థిక లోటును దిద్దుబాటు చేసేందుకు నడుం బిగించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచి రెండేళ్లలో మిగులు బడ్జెట్ వైపు దూసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పలువురు రెవెన్యూ ఉన్నతాధికారులతో సీఎం బాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3వేల కోట్ల ఆర్థిక లోటు ఉందని ఆ శాఖ అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఎర్రచందనం, ఇసుకపై ఆదాయం పెరిగిందని, అదే సమయంలో వ్యయం కూడా పెరిగిందని రెవెన్యూ అధికారులు సీఎంకు తెలిపారు. ఉద్యోగులకు ఫిట్ మెంట్, పెన్షన్ల పెంపు, రుణమాఫీ తదితర పథకాల కారణంగా ఆయా వర్గాలకు రాయితీలు ఇవ్వాలని ముందుగానే నిర్ణయించామని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులతో చంద్రబాబు చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర నుంచి రావాల్సిన రాయితీలపై కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్తో ఆయన ఫోన్ లో మాట్లాడారు ఏపీ సీఎం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Treasury  AP  Chandrababu Naidu  Defcit budget  

Other Articles