Sciensts Saying With Their Researches That Nails Are Health Indicators

Nails are health indicators says sientists new researches

nails health, health indicators, nails health indicators, health problems, kidney problems, lungs problems, heart problems, nutrients

Nails Are Health Indicators Says Sientists New Researches : According to the latest researches scientists are saying that Nails Are best Health Indicators.

మన చేతిగోళ్లే ఆరోగ్యానికి ‘ముఖసూచికలు’..!

Posted: 08/10/2015 07:19 PM IST
Nails are health indicators says sientists new researches

అవును.. టైటిల్ చదవడానికి ఆశ్చర్యంగా వున్నా.. అది నిజం. మన చేతిగోళ్లే ఆరోగ్యం ఎలా వుందోనన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అదేంటి.. చేతిగోళ్లు నోట్లో పెట్టుకుంటేనే అరిష్టమని పెద్దలంటుంటారు.. అలాంటివి అవి మన ఆరోగ్యాన్ని ఎలా తెలియజేస్తాయి..? అని అందరికీ సందేహం కలగకమానదు. ఆ విషయంలో ఎంతమాత్రం వాస్తవం వుందో పక్కా తెలియదు కానీ.. గోళ్ల రంగు, ఆకృతిని బట్టి ఆరోగ్యం తెలుసుకోవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ వివరాల గురించి తెలుసుకుందాం పదండి..

* సాధారణంగా కొంతమందికి గోళ్లు పెరిగి, తర్వాత వాటంతట అవే విరిగిపోతుంటాయి. ఇలాంటి వారికి కాల్షియం, విటమిన్ డి లేదా జింక్ లోపం ఉందని గ్రహించవచ్చు. అంటే.. అనారోగ్య బారిన పడే అవకాశాలున్నాయని స్పస్టం చేసుకోవచ్చు. అలాంటివారు కొవ్వు తక్కువ శాతం ఉన్న పాలపదార్థాలు, చేపలు వంటి వాటిని తినడం ద్వారా కాల్షియం, విటమిన్ డి, జింక్ సమకూర్చుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

* మరికొంతమందికి గోళ్లు పెరగవు, కొన్ని సార్లు పెరిగినా పాలిపోయినట్టు ఉంటాయి. ఇలాంటి వారికి రక్తహీనత, పోషకాహార లోపం వున్నట్లు గ్రహించాలి. దీని వల్ల గుండె లేదా కాలేయానికి సంబంధించిన వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. ఆ వ్యాధుల బారిన పడకుండా వుండాలంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు పోషకాహారం రెగ్యులర్ గా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.

* ఇంకొందరి గోళ్లు మందంగా, పసుపు రంగులో వుంటూ, నెమ్మదిగా పెరుగుతుంటాయి. ఇలాంటి వారికి ఊపిరితిత్తుల వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వీరు విధిగా ధైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలని కూడా హెచ్చరిస్తున్నారు. వైద్యులు ఇచ్చిన సలహాల మేరకు తరుచూ మందులు వాడాలని వారు చెబుతున్నారు.

* గోళ్లు తెల్లగా ఉన్నా లేక గోళ్ల మధ్యలో తెల్లని చారలు కనిపిస్తున్నా లివర్ కి సంబంధించిన వ్యాధుల బారిన పడే ప్రమాదముందని గ్రహించాలని వారు చెబుతున్నారు. లేదంటే హైపటైటిస్ వ్యాధి బారినపడే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు.

* గోళ్లు నీలం రంగులో ఉంటే శరీరానికి తగినంత ఆక్సిజన్ లభించడం లేదని భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. గోళ్లు అలా మారితే ఊపిరితిత్తులు, గుండె సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇలా ఈ విధంగా గోళ్లను పరీక్షగా చూసుకుని ఆరోగ్యం ఎలా వుందో తెలుసుకోవడంతోపాటు.. వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. గోళ్లను ఆరోగ్య ముఖసూచికలుగా వర్ణించడం జరిగింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nails health indicators  health problems  

Other Articles