A Young Teen Girl Harassed By Two Men In Bus In Which 20 Members Travelling | Jharkhand Crime News

Young teen girl harassed by two men in bus jharkhand

jharkhand crime news, girl molest in bus, 2 men molest a girl in bus, rape attempt in bus, rape accidents, rape incidents, girl molested by men, jharkhand

Young Teen Girl Harassed By Two Men In Bus Jharkhand : When two men tried to molest a young teen on a bus in Jharkhand, she shouted for help. Of the 20 people who were traveling with her, nobody responded.

వేధింపులు భరించలేక.. బస్సులోంచి దూకిన బాలిక

Posted: 08/10/2015 03:06 PM IST
Young teen girl harassed by two men in bus jharkhand

ఈ భారతదేశానికి ఏమైంది... ఓవైపు దేశం ప్రపవంచదేశాలతో అన్నిరంగాల్లో పోటీపడుతూ దూసుకెళుతుంటే.. మరోవైపు మానవమృగాలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పురుషాధిక్య సమాజం ప్రభావమో లేక ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం కారణమో తెలీదు కానీ.. మహిళలపై దురాగతాలకు మరింత పెరిగిపోతున్నాయి. ఇందుకు నిదర్శనంగా.. సభ్యసమాజం తలదించుకునే మరో ఘటన తాజాగా జార్ఖండ్ లో చోటు చేసుకుంది. ఒక ప్రైవేటు బస్సులో ఇద్దరు దుర్మార్గులు వేధింపులకు పాల్పడడంతో ఓ మైనర్ బాలిక బస్సులోంచి దూకేసిన ఘటన కలకలం రేపింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తొమ్మిదవ తరగతి చదువుతున్న అమ్మాయి స్కూలునుంచి ఇంటికి తిరిగివస్తున్న సమయంలో ఇద్దరు దుర్మార్గులు జంషెడ్ పూర్ లో వేధింపులకు పాల్పడ్డారు. తనకు సహాయం చేయాల్సిందిగా ఎంతగా అర్థించినా ఫలితం లేకపోయింది. ఆ సమయంలో సుమారు 20 మందిదాకా ప్రయాణికులు ఆ బస్సులో వున్నప్పటికీ ఎవరూ స్పందించలేదు. దీంతో ఈ నీచులు మరింత రెచ్చిపోయారు. ఇక గత్యంతరం లేక.. ఆ బాలిక కదులుతున్న బస్సులోంచే దూకేసింది. దాంతో ఆమె కాళ్లు విరిగిపోయాయి. తలకు, ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ బాలిక తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది.

ఇదిలావుండగా.. ఆ బాలికపై వేధింపులకు పాలడ్పిన ఆ ఇద్దరు నిందితులు బస్సు డ్రైవర్, కండక్టర్ స్నేహితులను సీనియర్ పోలీసు అధికారి అనూప్ మాథ్యూ తెలిపారు. బస్సు డ్రైవరును, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, బస్సు కండక్టర్ పరారీలో వున్నాడన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jharkhand  teen molest by men  bus rape incidents  

Other Articles