Congress | Parlaiment | MPs | Rajyasabha

The opposition congress appeared unrelenting protesting in the well of the rajya sabha

Congress, Parlaiment, MPs, Rajyasabha, Modi, Sonia Gandhi, Lalith Modi, Sushma Swaraj

the opposition Congress appeared unrelenting protesting in the well of the Rajya Sabha The monsoon session of Parliament entered its last week even as the opposition Congress appeared unrelenting protesting in the well of the Rajya Sabha. They entered the House with placards and wearing black arm bands.

పురుషులందు పార్లమెంట్ సభ్యులు వేరయా..

Posted: 08/10/2015 01:20 PM IST
The opposition congress appeared unrelenting protesting in the well of the rajya sabha

ఏంటి టైటిల్ చదవగానే వేమన శతకంలోని లైన్ గుర్తుకువచ్చిందా...? అవును పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ అని ఉంది. అయితే పార్లమెంట్ లో గత కొంత కాలంగా తలెత్తిన పరిస్థితులు వింతగా ఉన్నాయి. విపక్షాలు అధికారపక్షం మీద కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు. ఐదు రోజుల సస్సెన్షన్ తర్వాత కూడా కాంగ్రెస్ ఎంపీల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. సభ ప్రారంభం కాగానే మళ్లీ అదే రచ్చ మొదలుపెట్టారు. లలిత్: మోదీ, సుష్మస్వరాజ్ వివాదాల మీద పార్లమెంట్ లో చర్చకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. సభ సజావుగా కొనసాగించకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నాయకులు గట్టిగా నినాదాలు చేశారు. ప్లకార్డులతో అధికారపక్షంతో వ్యతిరేకంగా ఎంపీలు మళ్లీ అదే రచ్చ చేశారు.

రాజ్యసభ నిర్వహణ తీరుపై అధికార పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ వారికి ఎప్పుడంటే అప్పుడు మాట్లాడే అవకాశం ఇస్తూ, ప్రభుత్వానికి మాత్రం అవకాశం ఇవ్వడం లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిరసన తెలిపారు. అధికార పార్టీ హక్కులను కూడా సభాపతి కాపాడాలని సూచించారు. సభ ప్రారంభమైనప్పటి నుంచీ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. సభను సాగనిచ్చేది లేదని ముందే ప్రకటించిన విధంగా రభస సృష్టించారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని గందరగోళం నెలకొంది. ఈ దశలో డిప్యుటీ చైర్మన్ కురియన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వెంటనే కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడటానికి అవకాశం ఇచ్చారు. దీనిపై అరుణ్ జైట్లీ తీవ్ర స్థాయిలో నిరసన తెలిపారు. అధికార పార్టీకి అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆక్షేపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  Parlaiment  MPs  Rajyasabha  Modi  Sonia Gandhi  Lalith Modi  Sushma Swaraj  

Other Articles