Kabul | Attack | Terror | Afghanistan

Kabul rocked by deadly explosions

Kabul, Attack, Terror, Afghanistan, Police, 35 dead, Kabul Bomb Blast, Suicide attack

At least 35 people have died and hundreds more have been wounded in separate bomb attacks over the last 24 hours in the Afghan capital Kabul. A suicide bomber blew himself up near the city's police academy on Friday evening, killing about 20 recruits.

కాబూల్ లో ఉగ్రదాడి.. 35 మంది మృతి, 200 మందికి గాయాలు

Posted: 08/08/2015 10:43 AM IST
Kabul rocked by deadly explosions

బాంబు పేళుడుతో అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం రక్తిసిక్తమైంది. దేశ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయానికి దగ్గరలో ఈ ఘటన జరిగింది. అత్యంత శక్తివంతమైన పేలుడు పదార్ధాలతో నిండిన ట్రక్కును గుర్తుతెలియని వ్యక్తులు పేల్చివేశారు. ఈ ప్రమాదంలో 35 మంది మృతిచెందారు. 200మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు సమీపంలోని ఇళ్లు ధ్వంసమయ్యాయని పోలీస్ అధికారి అబ్దుల్ రహమాన్ రహిమి తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించాయి. తాలిబన్ నేత ముల్లా ఉమర్ మరణం తరువాత దేశంలో  మొదటిసారిగా జరిగిన బాంబు పేలుడు.  

ఒకప్పుడు ఆప్ఘనిస్థాన్ అంటే బాంబ్ లతో మోతమోగేది.. కానీ గత కొంత కాలంగా బాంబ్ దాడులు, హింసాత్మక ఘటనలు కాస్త సర్దుమణిగాయి అని అనుకుంటున్న తరుణంలోనే తాలిబన్ నేత ముల్లా ఉమర్ మరణం కలకలం రేపింది. అయితే తాజాగా పోలీస్ అకాడమిని టార్గెట్ గా చేసేకొని ఉగ్రవాదులు హింసకు పాల్పడ్డారని. భారీగా పోలీసుల ప్రాణాలను టార్గెట్ గా చేసుకొని దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన దాడి నేపథ్యంలో ఆప్ఘనిస్తాన్ లో హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులు, భద్రతా బలగాలు  సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kabul  Attack  Terror  Afghanistan  Police  35 dead  Kabul Bomb Blast  Suicide attack  

Other Articles