geeta | Pakistan | Bhajrangi Bhaijaan

Amritsar couple claims geeta in pakistan is their daughter pooja

geeta, Pakistan, Bhajrangi Bhaijaan, Pooja, India, Amritsar

Amritsar couple claims Geeta in Pakistan is their daughter Pooja: A deaf and mute couple from Amritsar claimed that Geeta, the girl being looked after by Edhi Foundation in Karachi for the past 13 years, is their daughter Pooja,

పాకిస్థాన్ లోని గీత మా అమ్మాయే అని వాళ్లు. కాదని ఆమె

Posted: 08/07/2015 03:52 PM IST
Amritsar couple claims geeta in pakistan is their daughter pooja

భజరంగీ బాయిజాన్ సినిమాలా... రివర్స్ గా ఇండియాలో తప్పిపోయి పాకిస్తాన్ లో ఉన్న మూగ చెవిటి అమ్మాయి గీత గురించి మనకు తెలిసిందే. కాగా గీత తమ కూతురే అని అమృతసర్ కు చెందిన ఓ దంపతులు ముందుకొచ్చారు. 13 ఏళ్ల క్రితం తప్పపోయి పాకిస్థాన్ లో ఆశ్రయం పొందుతున్న గీత కథనం భారత్, పాకిస్థాన్ దేశాల మీడియాతో పాటు పలువురి దృష్టిని ఆకర్షించింది. ఆ గీత మా అమ్మాయి అని అమృత సర్ కు చెందిన రాజేశ్ కుమార్, రామ్ దులారీ దంపతులు తమ కొడుకు రాజు తో సహా మీడియాని ఆశ్రయించారు. దీంతో ఆ ఛానల్ వారు లైవ్ కవరేజ్ ద్వారా దంపతులు పాకిస్థాన్ లోని ఈధీ పౌండేషన్ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు.

కాగా గీతకి తాము పూజ అనే పేరు పెట్టుకొన్నామని... ముద్దుగా గుడ్డీ అనికూడా పిలుచుకొనే వారమని దంపతులు చెప్పారు. మా పాప అమృత్ సర్ రైల్వే స్టేషన్ లో తప్పిపోయిందని తెలిపారు. తమ కుమార్తెను తిరిగి తమ వద్దకు చేర్చాలని కోరుతున్నారు. గీత చిన్నతనం ఫోటోని కూడా తల్లిదండ్రులు చూపారు. కాగా వీరి ఇంటర్వ్యూని ప్రత్యక్ష ప్రసారంలో చూసిన గీత వారు తన తల్లి దండ్రులు కాదని చెప్పింది. తన తల్లి పంజాబీ సల్వార్ ధరంచదని.. చీరలే కడుతుందని చెప్పినట్లు సమాచారం. పాక్ మానవహక్కుల నేత అన్సారీ బర్నీ ఇప్పటికైనా గీత తమ కూతురు అని ఓ దంపతులు స్పందించడం మంచి పరిణామమని అన్నారు. గీతని అప్పగించే ముందు డిఎన్ ఏ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : geeta  Pakistan  Bhajrangi Bhaijaan  Pooja  India  Amritsar  

Other Articles