BJP | Congress | LandBill | Goodsservices Bill

Bjp party tying to bring landbill and goods serivces tax bill in rajyasabha

BJP, Congress, LandBill, Goodsservices Bill, Rajyasabha, Parliament

BJP party tying to bring Landbill and goods serivces tax bill in Rajyasabha. Congress and other oppsition parties also getting ready to oppose the BJP strategy.

బిజెపి ప్లాన్ ఎ.. కాంగ్రెస్ అండ్ కో ప్లాన్ బి

Posted: 08/07/2015 08:30 AM IST
Bjp party tying to bring landbill and goods serivces tax bill in rajyasabha

ఏంటి ప్లాన్ ఎ, ప్లాన్ బి అనగానే ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో ఏజెంట్ చేస్తున్న ఆపరేషన్ అనుకునేరూ అస్సలు కాదు. భారత పార్లమెంట్ సాక్షిగా వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న నాటకాలను అలా వివరించాం అంతే. ఇక అసలు విషయానొస్తే రాజ్యసభలో కీలక పోరుకు ఎన్డీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ సిద్ధమవుతున్నాయి. లోక్ సభలో 25 మంది ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు, మొత్తం ఎంపీలు నిరసనలు చేపడుతున్నందువల్ల.. సభలో విపక్ష సభ్యులు లేని సమయంలో కీలకమైన భూ సేకరణ బిల్లు, గూడ్స్ సర్వీసెస్ టాక్స్ బిల్లు, ఇతర ముఖ్యమైన బిల్లులను ఆమోదింప జేసుకోవాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇదే నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకూ.. సభ్యులంతా ఒక్క క్షణంకూడా సభను విడిచి పోకుండా బీజేపీ విప్ జారీ చేసింది.

బిజెపి పార్టీ వేస్తున్న ప్రతి అడుగును ఎంతో నిషితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ కూడా దీటుగా స్పందించింది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తమ సభ్యులకు కూడా విప్ జారీ చేసింది. రాజ్యసభ సభ్యులంతా సభలకు తప్పక హాజరు కావాలని.. కేంద్రం బిల్లులను హడావుడిగా ఆమోదింపజేసుకునే కుట్రను అడ్డుకోవాలని స్పష్టం చేసింది. కాంగ్రెస్ యత్నాలను అడ్డుకునేందుకు బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు సిద్ధమవుతున్నాయి. దీంతో రాజ్యసభ ప్రస్తుతం యుద్ధ భూమి కానుంది. ఎగువసభలో కాంగ్రెస్ కు 68 మంది సభ్యులున్నారు. వారంతా రోజూ తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ అధినేత్రి సోనియా కోరుతున్నారు. రాజ్యసభలో ఎన్డీఏకు మెజారిటీ లేనందువల్ల కాంగ్రెస్ వ్యూహాన్ని చిత్తుచేసే పరిస్థితి లేదు. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే..కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలదే పైచేయి కాగలదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Congress  LandBill  Goodsservices Bill  Rajyasabha  Parliament  

Other Articles