Pakistan stands 'exposed' after militant strike at Udhampur

Captured terrorist will prove pak hand in terrorism rajnath

Border Security Force (BSF), India-Pakistan, Jammu and Kashmir, Kasim Khan, LeT terrorist Qasim Khan, Momin Khan, LeT terrorist Kasim Khan, 3 locals into hostage, J&K terror attack, BSF convoy attacked, Border Security Force Convoy attacked, Jammu and Srinagar Highway, Udhampur, JandK police, JK police, Home Ministry, Rajnath Singh, BSF Convoy, India, Pakistan, Udhampur Terror Attack Captured Pakistani terrorist, Naved, Usman, Rajnath Singh, home minister, Udhampur Terror attack, Pakistani Terrorist

The two terrorists who attacked a BSF convoy on the Jammu-Srinagar Highway, killing two BSF personnel, belong to Pakistan, home minister Rajnath Singh said in Rajya Sabha on Thursday.

వాడు మా వాడు కాదన్న పాక్.. దాయాధి దేశ ఉగ్రవాదేనన్న రాజ్‌నాథ్‌

Posted: 08/06/2015 07:54 PM IST
Captured terrorist will prove pak hand in terrorism rajnath

అజ్మల్ కసబ్ తరువాత భారత బలగాలకు ప్రాణాలతో చిక్కిన ఉగ్రవాది మహమ్మద్ నవీద్ విషయంలోనే దాయాధి దేశం అదే బోంకుడు బొంకింది. జమ్మూకశ్మీర్‌లో పట్టుబడిన ఉగ్రవాది నవీద్‌ తమ దేశస్థుడు కాదని పాకిస్థాన్‌ ప్రకటించింది. ఉధంపూర్ ఘటనలో సజీవంగా చిక్కిన మహ్మద్ నవీద్ యాకూబ్ అలియాస్ ఉస్మాన్ అలియాస్ ఖాసింఖాన్ పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందినట్టు అతనే స్వయంగా ఒప్పుకున్నా.. పాకిస్థాన్ మాత్రం నవీద్ కు సంబంధించిన తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని పేర్కోంది.

ఉగ్రవాది స్వయంగా తన పేరు మహ్మద్ నవీద్ అని, తాను పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ కు చెందిన వాడినని చెప్పుకున్నాడని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం లోక్‌సభలో ప్రకటించిన కొద్దిసేపటికే పాకిస్థాన్ స్పందించింది. అసలు నవీద్ తమ దేశస్థుడే కాదని బుకాయించింది. భారత్ తమపై అనవసర ఆరోపణలు చేస్తోందని మండిపడింది. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉధంపూర్ వద్ద బుధవారం బీఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై జరిపిన ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్లు మరణించిన సంగతి తెలిసింది.

ఎదురు కాల్పుల్లో మహ్మద్ మొమిన్ అనే ఉగ్రవాది మృతి చెందగా మరో ఉగ్రవాది ఉస్మాన్ సజీవంగా పట్టుబడ్డాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. అంతకుముందు తనది పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ అని మహ్మద్ నోమిన్‌తో కలిసి భారత్‌లో ఉగ్రదాడి జరిపేందుకు వచ్చానని ఉస్మాన్ స్వయంగా ఒప్పుకున్నాడు. తనకు 20 సంవత్సరాలని ఓసారి.. కాదు 16ఏళ్లని మరోసారి చెప్పాడు. అయితే పాక్ మాత్రం తన వక్రబుద్ధిని మరోసారి బయటపెడుతూ భారత్‌కు చిక్కిన నవీద్ అసలు పాకిస్థాన్ దేశస్తుడే కాదని ప్రకటించి తన కుటిలత్వాన్ని మరోసారి బయటపెట్టింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Border Security Force (BSF)  India-Pakistan  Jammu and Kashmir  naved  khasim khan  

Other Articles