Lawmakers Daughter | Uttarpradesh | Police

Cop refuses to pay vendor pulled up by lawmakers daughter

Lawmaker's Daughter, Uttarpradesh, Police, Apples

Cop Refuses to Pay Vendor Pulled Up by Lawmakers Daughter. Raising voice against the high-handed behaviour by a section of policemen in small towns, the daughter of a ruling Samajwadi Party lawmaker was recently seen pulling up a constable on the streets of Patiyali in Kasganj, Uttar Pradesh.

పోలీస్ ఐతే ఫ్రీగా తీసుకుపోతారా.? రోడ్డు మీద ఖాకీలను కడిగేసింది

Posted: 08/04/2015 12:45 PM IST
Cop refuses to pay vendor pulled up by lawmakers daughter

గతంలో పోలీస్ ఉద్యోగం ఉందంటే చాలు వాళ్లకు ఆడపిల్లను ఇవ్వడానికి క్యు కట్టేవాళ్లు. పోలీస్ లకు అన్నీ ఫ్రీ అనే భ్రమ ఉండేది. రోడ్డు మీదకు వెళితే వచ్చే మామూళ్లు... మార్కెట్ కు వెళితే ఫ్రీగా వచ్చే సరుకులు.. తప్పు చేసిన వారి దగ్గరి నుండి కాసులు లాగడం ఖాకీలకు వెన్నతో పెట్టిన విద్యలా ఉండేది.. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది చాలా మంది ప్రజలు పోలీసులకు భయపడేరోజులు పోయాయి. తప్పు చెయ్యకపోతే భయమేంటీ అన్నట్లు ఉంటున్నారు. అయినా అక్కడక్కడ కొంత మంది ఖాకీలు అమాయకుల మీద విరుచుకుపడుతుంటారు.. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారిని పోలీసులు దోచుకుంటూ ఉంటారు. అలా దోచుకుంటున్న ఓ ఖాకీనీ రోడ్డు మీదే కడిగేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్ లో దుమ్మురేపుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ లో రోడ్డు పక్కల వ్యాపారం చేస్తున్న ఓ చిరు వ్యాపారి దగ్గరి నుండి ఓ పోలీస్ యాపిల్స్ తీసుకున్నాడు. సరే యాపిల్ పళ్లకు ఖరీదు కట్టి ఇవ్వాల్సిందిపోయి... ఫ్రీగా నొక్కేద్దామనుకున్నారు. కానీ ప్లాన్ బెడిసికొట్టింది. అటుగా వచ్చిన ఓ ప్రజాప్రతినిధి కూతురు పోలీస్ దౌర్జన్యం మీద నిలదీసింది. మీరు కూడా ఇలా వ్యాపారుల నుండి దోచుకుంటుంటే ప్రజలు మాత్రం ఏం చేస్తారు..? డ్రెస్ వేసుకోవడానికి ముందు ప్రామిస్ చేసిన మీరు కూడా ఇలా చేస్తారేంటి..? మీరే దోచుకుంటే ఎలా..?  వెంటనే ఆ వ్యాపారికి డబ్బులు ఇచ్చేయండి..? అంటూ ఖాకీని బాగా కడిగేసింది. అయితే దీన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి ఈ వీడియోను అందరికి షేర్ చేశారు. నెట్ లో క్షణాల మీద ప్రచారం పొందిన ఈ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. అయినా ప్రజలకు మండితే పోలీసులైనా పోనీలే అని ఎవరూ అనలేని పరిస్థితి. కాబట్టి ఫ్రీగా కొట్టేద్దాం అనుకునే పోలీస్ లు బీ కేర్ ఫుల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lawmaker's Daughter  Uttarpradesh  Police  Apples  

Other Articles