special status | ap | bihar | Nirmala SeethaRaman

Central minister nirmala seetharaman said that special status not for bihar only

special status, ap, bihar, Nirmala SeethaRaman, central Govt, Parliament, Indrajeeth singh

Central Minister Nirmala Seetharaman said that special status not for bihar only. The NDA govt assurance to give all facilities to ap and telangana. SeethaRaman clear that ap will get special status.

ప్రత్యేక హోదా బీహార్ కు లేదన్నాం.. ఏపికి కాదు

Posted: 08/03/2015 09:29 AM IST
Central minister nirmala seetharaman said that special status not for bihar only

ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు.. ఇక ముందు కూడా ఇవ్వం  అని కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఏపిని తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ దీనిపై స్పష్టతనిచ్చారు. రెండు తెలుగు రాష్ర్టాలకూ న్యాయం చేస్తామని, విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలనూ నెరవేరుస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఇకపై ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ లోక్‌సభలో కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్‌ సింగ్‌ బీహార్‌ రాష్ట్రాన్ని ఉద్దేశించి చెప్పారని వివరించారు. ఈ వ్యాఖ్యలను ఏపీకి వర్తింప చేయొద్దని, ప్రజల్ని అయోమయానికి గురిచేయొద్దని సూచించారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై మాట మార్చిన అధికార బీజేపీని పార్లమెంటులో ఇరుకున పెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. కాగా నిర్మలా సీతారామన్ ప్రకటనపై సందిగ్దత నెలకొంది.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఏపికి ప్రత్యేక హోదా మీద స్పష్టమైన ప్రకటన చేశారు. బీహార్ ను ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు అని ప్రకటన చేశారని... ఏపికి అది వర్తించదు అని అన్నారు. అయితే నిర్మలా సీతారామన్ మాటకు, కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ మాటలకు మద్యన పొంతన కుదరడం లేదు. కేంద్ర మంత్రి ఇంద్రజిత్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని ప్రకటన చేశారు. కానీ నిర్మలా సీతారామన్ మాత్రం పార్టీ మీడియా సమావేశంలో మాత్రమే ఈ ప్రకటన చేశారు. మరి పార్లమెంట్ లో చేసిన ప్రకటన సరైందని అనుకోవాలో లేదా నిర్మలా సీతారామన్ ప్రకటన నిజమని అనుకోవాలో అర్థం కావడం లేదు,. అయితే టిడిపి నాయకులు మాత్రం మేం చెప్పినట్లుగా కేంద్రం ప్రకటన కేవలం బీహార్ రాష్ట్రానికి మాత్రమే వర్తింస్తుందని ఏపికి వర్తించదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : special status  ap  bihar  Nirmala SeethaRaman  central Govt  Parliament  Indrajeeth singh  

Other Articles