Rahul Gandhi | Congress | Film and Television Institute of India

Rahul gandhi look like a student at at programmee in film and television institute of india

Rahul Gandhi, Congress, Film and Television Institute of India, Rahul Look, Rahul

Rahul Gandhi look like a student at at programmee in Film and Television Institute of India. Congress vice-president Rahul Gandhi on Friday visited the Film and Television Institute of India (FTII) and expressed solidarity with the agitating students.

రాహుల్ గాంధీ ఓ స్టూడెంట్.. ఓ లీడర్

Posted: 07/31/2015 03:38 PM IST
Rahul gandhi look like a student at at programmee in film and television institute of india

ఎండా కాలంలో కూల్ డ్రింక్ అమ్మాయి.. వానాకాలంలో గొడుగులు అమ్మాలి అలా కాదని చేస్తే వ్యాపారం నష్టపోతుంది. ఇప్పుడే ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు రాహుల్ గాంధీ. ఏంటీ రాహుల్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు అనుకున్నారా ఏంటీ.. అస్సలు కాదు. తనకు ఏది ప్లస్సో దాని మీద దృష్టిసారించారు రాహుల్ గాంధీ. ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా.. పార్టీని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో విమర్శలపాలయ్యారు. అయితే తాజాగా రాహుల్ గాంధీ పంథా మార్చుకున్నారు. గతంలో కాకుండా రాహుల్ గాంధీ అన్నింటా మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియాలో రాహుల్ డ్రెస్సింగ్, మాట తీరు చూస్తుంటే అర్థమవుతంది.

ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియాను సందర్శించిన రాహుల్ గాంధీ అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. అయితే అక్కడికి బ్లూకలర్ టీ షర్ట్, జీన్స్ తో కాలేజి కుర్రాడిలా కనిపించారు. అక్కడి విద్యార్థులు కూడా రాహుల్ లుక్ కు ఫ్లాట్ అయ్యారట. ఇక అక్కడి విద్యార్థులను పరిస్థితుల మీద అడిగి తెలుసుకున్నారు. అక్కడి సమస్యలను వివరిస్తున్న విద్యార్థుల ప్రసంగాలను రాహుల్ గాంధీ ఎంతో శ్రద్దగా విన్నారు.

rahul-gandhi-among02

ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఇండియాలో రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించిన రాహుల్ గాంధీ అక్కడి విద్యార్థుల సింపధి కొట్టేశారు. స్టూడెంట్ లుక్ లో కనిపిస్తూనే  లీడర్ గా అన్ని అంశాల మీద శ్రద్దగా వినడం అందరిని ఆకర్షించింది. ఉత్తమ శ్రోత కాని వారు ఉత్తమ వక్త కాలేరు అన్న సామెత రాహుల్ గాంధీ బాగా అర్థం చేసుకున్నట్లున్నారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో చాణిక్యాన్ని సంపాదిస్తున్న రాహుల్ మొత్తానికి రాజకీయాలకు సిద్దంగా అవుతున్నారు.

rahul-gandhi-among03

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Congress  Film and Television Institute of India  Rahul Look  Rahul  

Other Articles