KCR | GramaJyothy | Telangana

Telangana cm kcr conduct a review meeting on gramajyothy programmee

KCR, GramaJyothy, Telangana, PattanaJyothy, Godavari Pushkaralu, Telangana Govt

Telangana cm KCR conduct a review meeting on gramajyothy programmee. KCR appriciate the officials who cooperate the Godavari Pushkaralu .

గ్రామజ్యోతి పథకంపై కేసీఆర్ సమీక్షాసమావేశం

Posted: 07/30/2015 04:46 PM IST
Telangana cm kcr conduct a review meeting on gramajyothy programmee

తాగడానికి మంచినీరు లేని సింగపూర్ ప్రపంచాన్ని శాసిస్తోందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ఆగస్టు 15వ తేదీన ప్రారంభించనున్న గ్రామజ్యోతి పథకం పైన కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో గ్రామజ్యోతి కోసం ఏర్పడిన మంత్రివర్గ ఉపసంఘం, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సంయుక్త కలెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలను భాగస్వామ్యం చేసి పంచాయతీరాజ్ వ్యవస్థలో మార్పు సాధించేలా చూడాలన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పంచాయతీరాజ్ సంస్థల విస్తరణ జరిగిందన్నారు. ఇప్పుడు అలా కావడానికి వీల్లేదన్నారు. ప్రజల సంఘటిత శక్తి బలం ఏమిటో గుర్తించాలన్నారు. ఎవరి ఊరు ఎలా ఉండాలో ప్లాన్ చేసుకునేలా ప్రజలకు నేర్పాలన్నారు. ప్రజలంతా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రజల భాగస్వామ్యం సాధఇంచి పంచాయతీ రాజ్ వ్యవస్థలో మార్పు సాధించాలన్నారు. గంగదేవిపల్లి, అంకాపూర్, ములకనూరు సహకార వ్యవస్థలు ఆదర్శమని చెప్పారు. ప్రజలను గ్రామజ్యోతిలో భాగస్వాములను చేయాలన్నారు. గ్రామాలను ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకునేలా చేయాలన్నారు. గ్రామజ్యోతిలా పట్టణ జ్యోతి ప్రారంభిస్తామన్నారు.

రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల్లో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అందుకోసం గ్రామజ్యోతి కార్యక్రమం మాదిరిగానే పట్టణ  జ్యోతి కార్యక్రమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. చిత్తశుద్ధి, పట్టుదల ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేసిన దగ్గర మంచి ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. మిగతా చోట్ల కూడా అదే తీరుగా మారాలని తెలిపారు. గోదావరి పుష్కరాలను అధికారులు అద్బుతంగా నిర్వహించారని అన్నారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు రేయింబవళ్లు కష్టపడి పనిచేశారని కితాబిచ్చారు. పోలీసులు చాలా మర్యాదగా ప్రవర్తించారని అభినందించారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది జరిగే మేడారం జాతర కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని కోరారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన మిషన్ కాకతీయ చాలా గొప్పగా జరిగి దేశం దృష్టిని ఆకర్షించిందని వివరించారు. మిషన్ కాకతీయ పథకాన్ని నీతి ఆయోగ్ అధికారులు, హైకోర్టు, కేంద్ర మంత్రులు అభినందించిన  విషయాన్ని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో గ్రామజ్యోతిని నిర్వహించాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  GramaJyothy  Telangana  PattanaJyothy  Godavari Pushkaralu  Telangana Govt  

Other Articles