Yakub Memon | Hanging | memon

Who is the only person offended by hanging memon

Yakub Memon, memon, Memon Hanged, Yakub Memon Hanged, Mumbai Blast, Mumbai bomb attack

Who is the only person offended by hanging memon. The news of hanging of Yakub memon the only one person feel very sad.

మెమెన్ ఉరితో బాధపడ్డ ఒకే ఒక్క వ్యక్తి ఎవరు..?

Posted: 07/30/2015 11:45 AM IST
Who is the only person offended by hanging memon

యాకుబ్ మెమెన్.. ఓ ఉగ్రవాది. 247 మంది చావులకు, 1400 మంది గాయాలపాలై జీవితాల్లో చీకటిని మూటగట్టుకున్న ఘటనకు కారకుడు. భారత ఆర్థిక రాజధాని ముంబైలో వరుస బాంబ్ పేలుళ్లకు కీలక సూత్రధారి అయిన యాకుబ్ మెమెన్ కు ఈ ఉదయం ఉరి శిక్ష అమలైంది. ఉదయం 6గంటల 50నిమిషాలకు మెమెన్ ను ఉరి తీసిన జైలు సిబ్బంది.. 7గంటల 1నిమిషానికి మెమెన్ చనిపోయినట్లు వెల్లడించారు. అయితే ఉదయం ఉరి తీసిన మెమెన్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించి.. తర్వాత జైలులోనే అంత్య క్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇంత కిరతక ఉగ్రవాది మెమెన్ ఉరి తీతపై, సుప్రీం కోర్టు నిర్ణయం మీద ఓ వ్యక్తి మాత్రం తెగ బాధపడుతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా..? అయితే ఆర్టికల్ చదవండి..

Also Read:  యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై సల్మాన్ అభ్యంతరం

యాకుబ్ మెమెన్ ఉరి సరైనది కాదు.... మెమెన్ కు రాజకీయ అండదండ లేనందు వల్లే ఉరి వేస్తున్నారు... యాకుబ్ మెమెన్ మెర్సి పిటిషన్ కొట్టివేత తీవ్ర బాధ కలిగించింది ఇలా రకరకాల స్టేట్ మెంట్ లిచ్చిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా..? ఇంకెవరు ఎంఐఎం సార్టీ తరఫున ఎంపీగా గెలిచి భారత కీర్తి పతాకాలను ఎగవేస్తున్న గ్రేట్ అసదుద్దీన్ ఓవైసీ. ఓవైసీ గారు యాకుబ్ మీనన్ మృతి మీద తీవ్ర ఆందోళన చెందారు. ఎంతలా అంటే ఓ దశలో ఉరి అమలు ఆగిపోతే బాగుంటుందన్నంతగా బాధపడ్డారు. అయితే మెమెన్ నిర్దోషి.. ఆయనకు ఏమీ తెలియదు అని అనడం తప్ప మిగిలిన అన్ని రకాలుగా మెమెన్ కు సపోర్ట్ గా ఉన్నారు.

Also Read:  యాకుబ్ మెమెన్ ఉరి.. మృతదేహానికి పోస్టుమార్టం

మెమెన్ ను ఉరి తీయాలి.. ఎంతో మంది చావులకు కారణమైన మెమెన్ ను వదిలిపెట్టకండి.. మా వారి ఆత్మలకు శాంతి చేకూర్చాలంటే మెమెన్ కు ఉరి తప్పని సరి అంటూ 1993 ముంబై బాంబ్ దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల ఆవేదన, ఆక్రోశం ఇది. ఎంతో మంది చావులకు, ఎన్నో కుటుంబాల చీకటి చిత్రాలకు కారణమైన మెమెన్ ను ఉరి తియ్యడం మీద ఎందుకు అంతగా ఓవైసీ బాధపడుతున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. మెమెన్ ను ఉగ్రవాదిగా భారతదేశం మొత్తం చూస్తుంటే.. ఒక్క అసదుద్దీన్ ఓవైసీ మాత్రం తన వర్గానికి చెందిన వ్యక్తిగా చూస్తున్నారు. అయినా భారతదేశం అంటే అందరికి మాట్లాడే హక్కు.. తమ బావాలను చెప్పే హక్కు ఉంది కాబట్టి చెప్పవచ్చు. అసదుద్దీన్ ఓవైసీ వ్యవహారం ఎలా అనిపిస్తోంది అంటే ఊరు మొత్తం ఓ దిక్కు ఉశప్ప మాత్రం ఓ దిక్కు అన్నట్లుగా ఉంది. పాపం ఓవైసీ బాధ ఎవరికి అర్థమవుతుందో ఏమో..

- Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yakub Memon  memon  Memon Hanged  Yakub Memon Hanged  Mumbai Blast  Mumbai bomb attack  

Other Articles