TPSC | Jobs | Notifications | KCR | Telangana | Govt Jobs | Groups, Group 1, Group 2

Telangana govt may release job notification in two weeks

TPSC, Jobs, Notifications, KCR, Telangana, Govt Jobs, Groups, Group 1, Group 2

Telangana govt may release job notification in two weeks. Telangana govt ready to release new job notifications and the financial ministry also clear to notifications.

మరో రెండు వారాల్లో జాబ్ నోటిఫికేషన్లు

Posted: 07/29/2015 10:59 AM IST
Telangana govt may release job notification in two weeks

ఎప్పుడెప్పుడా అనుకుంటన్న ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. మరో రెండు లేదంటే మూడు వారాల్లో నోటిఫికేషన్ విడుదలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కానిస్టేబుల్ దగ్గరి నుండి గ్రూప్ వన్ వరకు అన్ని పోస్టలు భర్తీకి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే తాజాగా టిపిఎస్సీ నుండి వివిధ శాఖలకు లేఖలు అందినట్లు సమాచారం. అందులో భాగంగా మరో వారం లేదంటే పది రోజుల్లో అన్ని శాఖల నుండి వివరాలు అందుతాయని.. తర్వాత ప్రభుత్వం అనుమతితో నోటిఫికేషన్ల జారికి సిద్దంగా ఉన్నమని టిపిఎస్సీ వర్గాలు తెలిపాయి. అయితే మొదటి విడుతగా విడుదల చెయ్యనున్న 15 వేల పోస్టుల భర్తీలో ఏయే పోస్టుల భర్తీ.. ఎలా జరుగుతుంది అన్న దానిపై భిన్నవాదనలు ఉన్నాయి.

Also Read :  తెలంగాణ నిరుద్యోగ యువతకు తీపికబరు

నిజానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నోటిఫికేషన్లు జారీ చెయ్యాలనే ఆలోచనలో ఉంది. అందుకే కేసీఆర్ 45 రోజుల గడువు విధిస్తూ నోటిఫికేషన్లను విడుదల చెయ్యాలని.. వాటిని వేగంగా భర్తీ చెయ్యాలని ఆదేశించారు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అలా లేదు. ఎందుకంటే ఒక్క పోలీస్ కానిస్టేబుల్ తో పాటు అగ్నిమాపక శాఖకు సంబందిచిన పోస్టులకు మాత్రం ఎలాంటి అడ్డంకి లేదు మిగిలిన వాటి వ్యవహారం మాత్రం మరోలా ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2 లలో కొత్తగా తెలంగాణ చరిత్రకు సంబందించిన అంశాలు అలాగే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబందించిన సెలబస్ ఖరారు కాలేదు. కోచింగ్ సెంటర్లలో తలో సెలబస్ ను బోధిస్తూ విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నారు.

Also Read :  తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి అంతా రెడీ: విఠల్

కొత్తగా తీసుకురావాలనుకుంటున్న గ్రూప్ 3 మీద ఇప్పటికే స్పష్టత లేదు. గ్రూప్ 2 లోని కొన్ని క్యాటగిరీలను ఇందులోకి చేరుస్తారా లేదా మొత్తంగా ఉన్న నాన్ టెక్నికల్ పోస్టులను ఇందులోకి చేరుస్తారా అన్న దాని మీద స్పష్టత రావాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం వేగంగా నోటిఫికేషన్లను జారీ చెయ్యాలని చూస్తున్నా కానీ అది ఆచరణలో కొంత అవరోధాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే సెలబస్ మీద క్లారిటీ రావాలి.. అలాగే సెలబస్ ను విద్యార్థులు ప్రిపేర్ కావడానికి కొంత సమయం కావాలి. అలా కాదని నోటిఫికేషన్ ను జారీ చేసినా కానీ న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.

Also Read :  తెలంగాణ ఉద్యోగ ప్రకటనలకు అంతా సిద్దం

తెలంగాణ ప్రభుత్వం ముందుగా అత్యవసరంగా అవసరమైన ఉద్యోగాల భర్తీకి తొందరగా నోటిఫికేషన్ల జారీకి సిద్దంగా ఉంది. అందులో భాగంగానే పోలీస్, అగ్నిమాపక శాఖ పోస్టులను భర్తీ చెయ్యడానికి కసరత్తు చేస్తోంది. అయితే మిగిలిన ఇంజనీర్ సంబందిత పోస్టులను వేగంగా భర్తీ చెయ్యాలని చూస్తోంది. కాగా గ్రూప్స్ లాంటి క్యాడర్ కు మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్న నేపధ్యంలో కాస్త ఆలస్యం కావచ్చు. అయితే ఆలస్యం అంటే ఎంతో కాలం అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే నోటిఫికేషన్లను విడుదల చెయ్యడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దపడ్డ.. కొన్ని వారాలు లేదా మహా అయితే ఒక నెల తర్వాత అన్ని రకాల నోటిఫికేషన్లు విడుదల అవుతాయని సమాచారం. మొత్తానికి ఉద్యోగాల భర్తీకి అంతా సిద్దమైన నేపథ్యంలో జాబ్ కొట్టుకునే సత్తా ఉంటే చాలు జాబ్ గ్యారెంటీ. ఇక ఆలస్యమెందుకు..

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : TPSC  Jobs  Notifications  KCR  Telangana  Govt Jobs  Groups  Group 1  Group 2  

Other Articles