Godavari Maha pushkaralu, AP, Rajahmundry, Godavari Pushkaralu, Celebration on Godavari Pushkaralu

Grand spectacle planned at godavari maha pushkaralu

Godavari Maha pushkaralu, AP, Rajahmundry, Godavari Pushkaralu, Celebration on Godavari Pushkaralu

Grand spectacle planned at Godavari Maha Pushkaralu The Godavari Maha Pushkaram, more than 4 crore pilgrims would have taken a holy dip in the Godavari river, with the ghats here accounting for the bulk of them. It is estimated that the final figure may touch 4.5 or 4.6 crore by Saturday, the final day.

అంగరంగ వైభవంగా ముగియనున్న గోదావరి మహా పుష్కరాలు

Posted: 07/25/2015 08:14 AM IST
Grand spectacle planned at godavari maha pushkaralu

గోదావరి పుష్కరాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వందలమంది ప్రముఖులు పాల్గొనే ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను ఈ బాధ్యతలు చూస్తున్నారు. గోదావరి పుష్కరాల ముగింపు వేడుకలకు యోగా గురువు బాబా రాందేవ్‌, పలువురు కేంద్రమంత్రులు,రాష్ట్ర మంత్రులు,వందలమంది ప్రముఖులు హాజరుకానున్నారు. ముగింపు వేడుకలకు రాజమండ్రి ముస్తాబైంది.గోదావరి నిత్యహారతి, పుష్కరాల ప్రారంభంపై డాక్యుమెంటరీ నిర్వహణ బాధ్యతలు చూసిన ప్రమఖ దర్శకుడు బోయపాటి శ్రీనుకే ముగింపు వేడుకల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు.

Also Read:  ఇసకేస్తే రాలనంత జనం.. గోదారికి పోటెత్తిన భక్తులు

రాజమండ్రిలోని రెండు వంతెనల మధ్య భారీ ఫోకస్‌ లైట్లు ఏర్పాటు చేసి ఆ వెలుగుల్లో నదీజలాలు సప్తవర్ణశోబితంగా కనిపించేలా చేయనున్నారు.లేజర్‌ షోను మరింత ప్రత్యేకంగా ఉండేలా చూస్తున్నారు. బాణాసంచా వెలుగుల్లో గోదారమ్మను మరింత అందంగా చూపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎయిర్‌ బెలూన్స్‌ కూడా సిద్ధమవుతున్నాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటా దీపం వెలిగించాలని పిలుపునిచ్చిన ప్రభుత్వం రాజమండ్రిలో గోదావరికి అఖండ హారతిని నిర్వహించనుంది. గోదావరి తీరంలోని మహిళంతా ఇంటికి ఒకరు చొప్పున తరలివచ్చిన ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరింది.అరటిదొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో వదిలే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముగింపు వేడుకలకు భారీగా జనం తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తున్నారు. స్నానాలకు వచ్చే భక్తులు, ముగింపు వేడుకల్లో పాల్గొనేవారితో ఘాట్లు కిటకిటలాడనున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. రాజమండ్రిలో భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసి ముగింపు వేడుకలను ప్రత్యక్షప్రసారం చేయనున్నారు.

Godavari-Pushkaralu-count

Also Read:  ఏడు కోట్లతో పుష్కరాల మీద డాక్యుమెంటరీ

పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం అంచనాకుమించి యాత్రికులు తరలివస్తున్నారు.ఏపిలో గోదావరి పుష్కరాలకు మూడు నుంచి నాలుగు కోట్ల మంది  వస్తారని ప్రభుత్వం అంచనా వేసినప్పుడు అంతా నివ్వెరపోయారు. ఈ లెక్కలు నిజమవుతాయా అన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ ఊహించినదానికంటే ఎక్కువగానే యాత్రికులు వచ్చారు.ఇప్పటికే భక్తుల సంఖ్య నాలుగు కోట్లు దాటిందని అంచనా. పుష్కరాలు ముగిసేనాటికి యాత్రికుల సంఖ్య ఐదు కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. ముగింపు ఉత్సవాలకు కూడా భారీగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles