ప్రపంచదేశాలతో పోటీపడుతున్న భారతదేశ గౌరవాన్ని మన నాగరికులే తమ స్వార్థం కోసం దిగజార్చుతున్నారు. అవినీతిని అరికట్టాల్సిన పోలీసులే దౌర్జన్యానికి దిగుతున్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన పోలీసులే దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అధికారం వుంది కదా అని సామాన్య ప్రజలపై విరుచుకుపడుతున్నారు. ఇబ్బందుల్లో వున్నాం సహాయం చేయండంటూ ప్రజలు వేడుకుంటే.. లంచం ఇస్తేగానీ చేయమంటూ విర్రవీగుతున్నారు. ఇటువంటి నీచులవల్లే పేరుగాంచిన పోలీసులు సైతం తలెత్తుకోలేక తిరుగుతున్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. ఓ రైల్వే పోలీసు అధికారి తనకు లంచం ఇవ్వలేదని ఓ చాంపియన్ ప్రాణాలను బలిగొన్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూపీకి చెందిన హోషియార్ సింగ్ అనే ఫెన్సింగ్ చాంపియన్ తన సొంత గ్రామానికి వెళ్లి.. అక్కడున్న తన తల్లి, భార్యను తీసుకుని నగరానికి తిరిగి వెళ్తున్నాడు. రిజర్వేషన్ కోసం ప్రయత్నించాడు కానీ లభించలేదు. దీంతో వారిద్దరిని లేడీస్ కోచ్ లో కూర్చోబెట్టి.. తాను వేరే బోగీలోకి ఎక్కాడు. కొద్దిసేపటివరకు ప్రయాణం సాఫీగానే సాగింది. అయితే.. మార్గమధ్యంలో తన భార్యకు సుస్తీగా వుందని తెలుసుకుని.. ఆ చాంపియన్ లేడీస్ కంపార్ట్ మెంటులోకి వచ్చాడు. దీన్ని చూసిన ఓ రైల్వే పోలీసు.. తనకు రూ.200 ఇస్తేనే ఆ బోగీలో వుండనిస్తానని డిమాండ్ చేశాడు. కానీ.. అందుకు హోషియార్ నిరాకరించడంతో ఆ పోలీసు నడుస్తున్న రైలు నుంచే అతడిని కిందకు తోసేశాడు. దీంతో ఆ చాంపియన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. తమ కళ్లముందే ఈ దారుణమైన ఘటన చోటు చేసుకోవడంతో ఆ చాంపియన్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ దారుణానికి ఒడిగట్టిన రైల్వే పోలీసుపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదిలావుండగా.. ఈ విషయంలో పోలీసుల కథనం మరోలా వుంది. హోషియార్ సింగ్ మంచినీళ్ల కోసం కిందకు దిగి, కదులుతున్న రైల్లోకి ఎక్కే ప్రయత్నంలో కాలు జారి మరణించాడని చెబుతున్నాడు. కానీ.. అతని కుటుంబసభ్యులు మాత్రం ఆ రైల్వే పోలీసే చంపాడని చెబుతున్నారు. చివరికీ ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో?
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more