Amaravathi Seed capital master plan, AP seed capital plan, Amaravathi Seed capital plan, Seed capital master plan

Ap cm chandrababu naidu very happy on amaravathi seed capital master plan

Amaravathi Seed capital master plan, AP seed capital plan, Amaravathi Seed capital plan, Seed capital master plan

AP cm Chandrababu naidu very happy on amaravathi seed capital master plan. Singapur minister Eeshwaran gave the master plan of ap new capital amaravathi to chandrababu naidu.

సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ సూపర్.. అంతా మంచే అంటున్న బాబు

Posted: 07/20/2015 06:50 PM IST
Ap cm chandrababu naidu very happy on amaravathi seed capital master plan

ఏపి  కలల రాజధాని అమరావతి  రూపు రేఖలు అదిరిపోయాయి. భవిష్యత్ లో ప్రపంచంలోనేి మేటి రాజధానిగా పేరు తెచ్చుకోవడానికి, దేశంలోని మిగిలిన అన్ని రాజధానులను తలదన్నేలా అమరావతి రూపుదిద్దుకోనుంది. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ నేతృత్వంలోని బృందం ఏపీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను సీఎం చంద్రబాబుకు అందజేసింది. నిన్న హైదరాబాద్ కు వచ్చిన సింగపూర్ బృందం రాజమండ్రిలోని పుష్కరాలను సందర్శించిన తర్వాత ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అమరావతి సీడ్ కేపిటల్ మాస్టర్ ప్లాన్ ను అందించారు. దీనిపై చంద్రబాబు నాయుడు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. పుష్కరాలు జరుగుతున్న సమయంలో సింగపూర్ మాస్టర్ ప్లాన్ ను అందించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు.

రాజధాని నిర్మాణ ప్రణాళిక అద్భుతంగా ఉందని, మాస్టర్ ప్లాన్ రూపొందించిన 30 మంది సభ్యుల సింగపూర్ బృందానికి ఏపి సిఎం చంద్రబాబు నాయుడు  అభినందనలు తెలిపారు. పుష్కరాల సమయంలో మాస్టర్ ప్లాన్ ఇవ్వడం శుభపరిణామం అని పేర్కొన్నారు. సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, అది నెరవేరుస్తామని సీఎం ఉద్ఘాటించారు. 3 లక్షల నివాస గృహాలకు అనుగుణంగా సీడ్ క్యాపిటల్ ప్రణాళిక ఉందన్నారు. బృహత్ ప్రణాళికతో 7 లక్షల మందికి ఉద్యోగాలు లభించే అవకాశముందని వివరించారు.
 
నవ్యాంధ్ర రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించాలనే ఉద్దేశ్యంతో 2014 నవంబర్ 12న సింగపూర్ ప్రతినిధులను కలిశామని, డిసెంబర్ 8న సింగపూర్ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఎంవోయూ కుదిరిందని చంద్రబాబు వివరించారు. మార్చి 30న క్యాపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్ ఇచ్చారని.. జూన్ 20 నాటికి మూడు మాస్టర్ ప్లాన్స్ వివరాలను ఇచ్చారు అని వివరించారు. మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్‌కు తాము ఒక్కపైసా కూడా చెల్లించలేదని బాబు తెలిపారు. వారే స్వయంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారని, ఏపీప్రభుత్వం తరఫున సింగపూర్ ప్రభుత్వానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
 
భారత్‌లో ఇప్పటి వరకు ప్రపంచస్థాయి నగరాల నిర్మాణం కాలేదని, ఇంతగొప్ప నగరం ఏపీదే కావడం విశేషమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహాయపడాలని కోరారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 7,420 కి.మీ పరిధిలో ఏపీ క్యాపిటల్ రీజియన్ ఉంటుందని, 40 లక్షల జనాభాకు అనుగుణంగా రాజధాని అమరావతి ఉంటుందని సీఎం వివరించారు. 217 చ.కి.మీ పరిధిలో అమరావతి నిర్మాణం జరుగుతుందన్నారు. అమరావతి అభివృద్ధిలో భాగస్వామిగా సింగపూర్ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని జపాన్ ప్రభుత్వాన్ని కోరామన్నారు. రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు ప్రధాని మోదీని ఆహ్వానించామని సీఎం చెప్పారు. అదేవిధంగా ప్రధాని మోదీ తరఫున సింగపూర్, జపాన్ ప్రధానులనూ ఆహ్వానించామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles