Kerala IPS Officer Merin Joseph's Photo With Actor Goes Viral. She Gives A Scathing Reply To Her Critics!

Kerala police officer merin joseph battles controversy over facebook photo with actor

Kerala IPS Officer Merin Joseph's Photo With Actor Goes Viral, Scathing Reply To Her Critics, Merin Joseph, Kerala police officer Facebook picture, Kerala IPS officer, Nivin Pauly, Kerala cop, Kerala cop Facebook controversy, MLA Hibi Eden, popular actor Nivin Pauly, charged with violating protocol., merin joseph photo controversy, Nivin Pauly, Kerala cop photo with actor viral

Merin Joseph, assistant commissioner of police, in Kerala posted her picture with popular southern actor Nivin Pauly on Facebook, it went viral. got thousands of 'likes', but far less admiring were media reports that alleged a violation of protocol.

నటుడితో ఫోటో దిగి.. ఇలా ఇబ్బందులు తెచ్చుకుంది..

Posted: 07/17/2015 07:07 PM IST
Kerala police officer merin joseph battles controversy over facebook photo with actor

అమె కేరళకు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారి.. అమె చేసిందేమీ లేదు. నిత్యం తన విధుల నిర్వహణలో బిజీబిజీగా వుంటూ.. తన పరిధిలోని ప్రజల సుఖశాంతులుగా వుండేట్లు చూస్తున్నారు. అంటే మరోలా చెప్పాలంటే.. తన పరిధిలో శాంతి భద్రతలను కాపాడుతుంటారు. అయితే ఇటీవల ఈమె ఒక వివాదంలో చిక్కుకున్నారు. ప్రముఖ మళయాల నటుడితో యూనీఫాంలో ఫోటో తీసుకుని.. దానిని సామాజిక మాద్యమం ఫేస్ బుక్ లో పెట్టడం.. అమె ఉద్యోగానికే ఎసరు తెచ్చేలా తయారైంది. ఎందుకంటారా..?

అమె పెట్టిన ఫోటోను రంద్రాన్వేషణ చేసిన అక్కడి మీడియా.. లేనిపోని రాద్దాంతం చేస్తూ దానిని పెద్ద వివాదంగా మార్చింది. దీంతో అమెపై ఉన్నతాధికారులు పోలీసు యూనిఫాంలో ఫోటో దిగడం పోలీసుల నిబంధనలను ఉల్లంఘించడమేనని అమెపై చర్యలకు ఉపక్రమించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎర్నాకుళంలోని ఒక కాలేజ్ లో ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి కేరళ హోం శాఖ మంత్రి, ప్రముఖ హీరో నివిన్ పాలీతో పాటు అనేక మంది ప్రముఖులు హాజరైనారు. అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తున్న మెరిన్ జోసెఫ్ ఆ కార్యక్రమానికి రక్షణ కల్పించారు.

కార్యక్రమం ముగిసిన తరువాత స్థానిక ఎమ్మెల్యే హిబి ఇడెన్ అభ్యర్థన మేరకు అమె, నటుడు నివిన్ తో ఫోటో దిగారు. అయితే తన పరిధిలో జరిగిన ఓ కార్యక్రమంలో తాను సినీ నటులకు కూడా రక్షణ కల్పించాన్న ఉత్సాహంతో కాబోలు మొత్తానికి అమె ఆ ఫోటోను ఫేస్ బుక్ లో ఫోస్ట్ చేశారు. తరువాత అనేక లైక్ లు, కామెంట్లు వచ్చాయి. మరోలా చెప్పాలంటే ఆ ఫోటో నెట్ లో హల్ చల్ చేసింది. అయితే ఆ సంతోషం మాత్రం ఆమెకు ఎక్కువ సేపు నిలువలేదు. కేరళలోని పలు టీవీ చానెల్స్ ఈ ఫోటోపై వరుస కథనాలు ప్రసారం చేశాయి.

యూనీఫాంలో ఒక పోలీసు అధికారి ఈ విధంగా ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తూ వార్తాకథనాలు ప్రసారమయ్యాయి. విషయం తెలుసుకున్నమెరిన్ జోసెఫ్ మీడియాపై మండిపడ్డారు. వారికి టీఆర్ పీ రేటింగ్ వస్తే చాలని ఇంక వేరే విషయాలు పట్టించుకోరని విరుచుకుపడ్డారు. నటుడు నివిన్ తో తాను ఫోటో తీసుకోవాలని చెప్పడంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ శాసన సభ్యుడు ఫోటో తీశారని, అప్పటికి కార్యక్రమం పూర్తి అయ్యింది, హోం మినిస్టర్ వెళ్లి పోయిన తరువాతే తాను నటుడు నివిన్ ను కలిశానని ఐపీఎస్ అధికారిని మెరిన్ వివరణ ఇచ్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kerala police officer  IPS officer merin joseph  controversy  facebook  photo with actor  

Other Articles